Sheldon Jackson: ఐపీఎల్ 2021 రెండో దశ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నిలకడగా రాణిస్తున్న భారత దేశీయ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ కూడా దీనికి సిద్ధంగా ఉన్నాడు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం ఆడుతున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడే షెల్డన్ ఐపీఎల్ వరకు రావడం కోసం చాలా కష్టపడ్డాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో షెల్డన్ తన జీవిత ప్రయాణం గురించి వివరించాడు. ఐపిఎల్‌కి ఎంపికకాక ముందు తాను దేశీయ క్రికెట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ప్రయత్నం చేసేవాడినని షెల్డన్ చెప్పాడు.
ఈ సందర్భంగా షెల్డన్ మాట్లాడుతూ “25 సంవత్సరాల వయస్సులో నేను క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. నేను రంజీ ట్రోఫీ జట్టులో ఐదు సంవత్సరాలలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అప్పుడు నాకు అత్యంత సన్నిహితుడు షపత్ షా నాతో నువ్వు చాలా కష్టపడ్డావని చెప్పాడు. కాబట్టి మరో సంవత్సరం పాటు ప్రయత్నించు ఏమీ జరగకపోతే వచ్చి నా ఫ్యాక్టరీలో పని చేయి అన్నాడు. నేను నీకు ఉద్యోగం ఇస్తానని భరోసా ఇచ్చాడు. దీంతో నేను మరో ఏడాది క్రికెట్ ఆడటానికి సిద్దమయ్యాను ” అని వివరించాడు.
రంజీ ట్రోఫీలో అద్భుతం
షెల్డన్ అదే పాటించాడు విజయాన్ని సాధించాడు. నేడు అతను సౌరాష్ట్ర బృందంలో ముఖ్యమైన సభ్యుడు. 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అనంతరం 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఐపిఎల్ అరంగేట్రం చేశాడు. అతను చెప్పాడు “ఆ సంవత్సరం నేను అన్ని రికార్డులను బద్దలు కొట్టాను. నేను అత్యధిక స్కోరర్ అయ్యాను. నేను భారత జట్టులో తప్ప అన్నిచోట్లా ఆడాను. నేను నాలుగు సెంచరీలు సాధించాను వాటిలో మూడు వరుసగా ఉన్నాయి. అక్కడ నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. నేను ఒకవేళ క్రికెట్ ఆడకపోయి ఉంటే రోడ్డు పక్కన ఎక్కడో పానీ పూరీని అమ్ముకేనేవాడిని ” అని తెలిపాడు.