Watch Video: రెండు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్న టీంఇండియా స్టార్‌ క్రికెటర్‌.. డ్యాన్స్‌ ఇరగదీసిండు..

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెండు రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నాడు. వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌తో శార్దూల్‌ వివాహం ఫిబ్రవరి 27 (సోమవారం)న జరగనుంది.

Watch Video: రెండు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్న టీంఇండియా స్టార్‌ క్రికెటర్‌.. డ్యాన్స్‌ ఇరగదీసిండు..
Shardul Thakur

Updated on: Feb 26, 2023 | 2:49 PM

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెండు రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నాడు. వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌తో శార్దూల్‌ వివాహం ఫిబ్రవరి 27 (సోమవారం)న జరగనుంది. ముంబయికి సమీపంలోని కర్జత్‌లో మహారాష్ట్ర పద్ధతిలో వీరి వివాహం జరనుంది. వీరి వివాహమహోత్సవానికి 200 నుంచి 250 వరకు అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి వేడుక ఇప్పటికే ప్రారంభం అయ్యింది. దీనిలో భాగంగా ఈ రోజు హల్దీ, మెహిందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో శార్దూల్‌, తన కుటుంబ సభ్యులతో అదిరిపోయే డ్యాన్స్‌ చేశాడు. డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన మిథాలీ స్వయంగా ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ 2022 తర్వాత వివాహం జరగాల్సి ఉంది. ఐతే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో శార్దూల్‌, మిథాలీ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us