Shane Warne Death Updates: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి..

|

Mar 04, 2022 | 10:01 PM

Shane Warne Passes Away Live Updates: Shane Warne Passes away: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Shane Warne Death Updates: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి..
Shane Warne

Shane Warne Passes away: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. క్రికెట్ ప్రముఖులతో పాటు క్రీడా ప్రేమికులు, అభిమానులు ఈ దిగ్గజ క్రీడాకారుడికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాథాయిలాండ్‌లోని కోహ్ సమీపంలోని  విల్లాలో  షేన్ వార్న్అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

కాగా క్రికెట్ లో ఆల్ టైం గ్రేటెస్ట్   స్పిన్నర్ గా పేరొందిన  షేన్‌ వార్న్‌ ఆస్ట్రేలియా తరఫున 1992లో  అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.  వార్న్ తన మొదటి మ్యాచ్ ను టీమిండియాపైనే ఆడడం గమనార్హం.  మొత్తం కెరీర్ లో 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.  కాగా సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో క్రికెటర్ గా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో  శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్నాడు.

ఇండియాతోనూ అనుబంధం..

ఇండియాతో టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వార్న్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో  ఎంతో అనుబంధం ఉంది. 2008  ప్రారంభ సీజన్‌లో అతను రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా   జట్టును విజయవంతంగా నడిపించి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Mar 2022 09:59 PM (IST)

    లెజెండ్స్ ఎప్పటికీ జీవించే ఉంటారు: వార్న్ మృతిపై శిల్పాశెట్టి..

    షేన్ వార్న్ లాంటి దిగ్గజాలు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపింది. ఈ సందర్భంగా ఆయనకు ట్విట్టర్ లో నివాళి అర్పించింది. కాగా ఐపీఎల్ వార్న్ నాయకత్వం వహించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిల్పాశెట్టి కో-ఓనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  • 04 Mar 2022 09:53 PM (IST)

    స్పిన్ బౌలింగ్ లో అతనో రివల్యూషనర్: వార్న్ మృతికి బుమ్రా నివాళి..

    స్పిన్ బౌలింగ్ లో షేన్ వార్న్ ఒక రివల్యూషనర్ అని జస్ ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఈ సందర్భంగా లెజెండరీ  క్రికెటర్ కు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించాడు బుమ్రా. ‘ షాక్ గు గురయ్యాను. అసలు మాటలు రావడం లేదు. స్పిన్ బౌలింగ్ లో ఆయనో రివల్యూషనర్. RIP షేన్ వార్న్’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు జస్ ప్రీత్.

  • 04 Mar 2022 09:44 PM (IST)

    ఓ దిగ్గజం లోకం విడిచి వెళ్లిపోయాడు: వార్న్ మృతిపై వీవీఎస్ సంతాపం..

    ‘ వార్న్ మరణం  నమ్మశక్యంగా లేదు. దిగ్భ్రాంతికి గురయ్యాను .  అంతర్జాతీయ క్రికెట్ లో  ఓ దిగ్గజం లోకం విడిచి వెళ్లిపోయాడు. వార్న్‌ కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి’  అని ట్విట్టర్  వేదికగా వార్న్ కు నివాళి అర్పించాడు వీవీఎస్ లక్ష్మణ్..

  • 04 Mar 2022 09:40 PM (IST)

    వార్న్ మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను: తెలంగాణ మంత్రి కేటీఆర్

    ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం తనను కలిచి వేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా లెజెండరీ క్రికెటర్ కు నివాళి అర్పించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ లో  గొప్ప లెగ్ స్పిన్నర్‌ అయిన వార్న్‌ మరణ వార్త నన్ను  దిగ్భ్రాంతికి గురిచేసింది.  లెజెంరడీ క్రికెటర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నాను.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు కేటీఆర్.

  • 04 Mar 2022 09:34 PM (IST)

    క్రికెట్‌లో అసలైన ఛాంపియన్‌.. వార్న్‌ మృతిపై రోహిత్‌ శర్మ

    వార్న్‌ మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.. ‘ వార్న్‌ మరణ వార్త విని మాటలు రావడం లేదు. ఇది చాలా విచారకరం. సమకాలీన క్రికెట్‌లో దిగ్గజం, అసలైన ఛాంపియన్‌ అయిన వార్న్‌ ఇప్పుడు మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. RIP షేన్ వార్న్.. ఇప్పటికీ నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను’ అని ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటించాడు హిట్‌మ్యాన్‌.

  • 04 Mar 2022 09:29 PM (IST)

    వార్న్‌ హఠాన్మరణాన్ని నమ్మలేకపోతున్నా: వాషింగ్టన్‌ సుందర్‌..

    ‘వార్న్‌ హఠాన్మరణాన్ని నమ్మలేకపోతున్నాను. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేలా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నాను. వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని టీమిండియా ఆల్‌ రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ట్వీట్‌ చేశాడు.

  • 04 Mar 2022 09:24 PM (IST)

    మాటలు రావడం లేదు: కృనాల్‌ పాండ్యా

    ‘షేన్‌ వార్న్‌ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. మాటలు రావడం లేదు. ఈ విషాద వార్తను తట్టుకునే మనో ధైర్యాన్ని అతని ప్రియమైనవారికి అందించాలని కోరుకుంటున్నాను. వార్న్‌ మృతి క్రికెట్‌ ప్రపంచానికి తీరని లోటు’ అని టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యా వార్న్ కు నివాళి అర్పించాడు.

  • 04 Mar 2022 09:20 PM (IST)

    జీవితం ఎంతో అనూహ్యమైనది.. వార్న్ హఠాన్మరణంపై విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి..

    ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మరణం జీర్ణించుకోలేకపోతున్నానని టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘జీవితం చాలా చంచలమైనది. ఎంతో అనూహ్యమైనది. క్రికెట్‌ ఫీల్డులో వార్న్‌ ఎంతో గొప్ప ఆటగాడు. మైదానంలోనూ ఎంతో అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. క్రికెట్‌లో బంతిని అతని కంటే బాగా మరెవరూ తిప్పలేరు. RIP షేన్‌ వార్న్‌’ అంటూ ట్విట్టర్‌ వేదికగా వార్న్‌కు నివాళి అర్పించాడు విరాట్‌..

  • 04 Mar 2022 09:12 PM (IST)

    షేన్ వార్న్ మరణం షాక్ కు గురిచేసింది.. జడేజా

    షేన్ వార్న్ మరణం తనను షాక్‌ కు గురిచేసిందని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్రజడేజా తెలిపాడు. ‘సమకాలీన క్రికెట్‌లో అతనొక గొప్ప స్టేట్స్‌మన్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వార్న్ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్‌ చేశాడు రవీంద్ర.

  • 04 Mar 2022 09:07 PM (IST)

    ‘వార్న్.. వియ్ మిస్ యూ’.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సచిన్ టెండూల్కర్..

    ‘వార్న్ మీ మరణ వార్త మమ్మల్ని షాక్ కు గురిచేసింది. మేం మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నీ చుట్టు పక్కల ఎప్పుడూ నిరుత్సాహం దరి చేరనీయలేదు. ఆన్ ఫీల్డ్ , ఆఫ్ ఫీల్డ్ అయినా మీతో గడిపిన క్షణాలను ఎప్పుడూ మర్చిపోలేను.  భారతదేశంపై మీరు ఎంతో ప్రేమ చూపించారు.  అందుకే మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు ‘ అని సచిన్ సోషల్ మీడియా వేదికగా వార్న్ కు నివాళి అర్పించారు.


     

  • 04 Mar 2022 08:59 PM (IST)

    గుండె పోటుతోనే మృతి.. ప్రాథమిక నిర్ధారణలో వైద్యులు..

    ఆసీస్‌ లెజెండరీ స్పిన్నర్‌ వార్న్‌ మృతికి గుండెపోటే కారణమని వైద్యులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. గుండెపోటు కారణంగా వార్న్‌ తన గదిలో అచేతనంగా పడి ఉండడం సిబ్బంది గమనించారని, వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు.

  • 04 Mar 2022 08:51 PM (IST)

    సహచరుడి మృతికి సంతాపం తెలిపిన కొద్ది గంటలకే..

    ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్ మార్ష్‌ ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు ‘ రాడ్‌ మార్ష్‌ మృతి చెందాడన్న వార్త వినడం బాధాకరం. క్రికెట్‌లో ఆయనో దిగ్గజం. చాలామంది యువ ఆటగాళ్లకు మార్ష్‌ ఓ స్ఫూర్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని అందులో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ చేసిన 12 గంటల తర్వాతే వార్న్‌ కన్నుమూశాడు. బహుశా విధి అంటే ఇదేనేమో..

Follow us on