Pakistan Cricket: లిస్టులో కపిల్ దేవ్, గవాస్కర్, రవిశాస్త్రి, టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్, జహీర్, ధోని వంటి ప్లేయర్ల పేర్లు లేకపోతే భారత క్రికెట్ లెజెండ్స్ అనే ప్రస్తావన వ్యర్థరహితం. అచ్చం అలాగే పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్స్ అంటే ఎవరు ఉన్నా లేకున్నా ఇమ్రాన్ ఖాన్ అనే పేరు తప్పక ఉండి తీరాల్సినదని అనేక మందిలో ఉన్న భావన. ఎందుకంటే పాకిస్థాన్ జట్టుని వరల్డ్ కప్ టోర్నీ(1992)లో ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత అతనొక్కడిదే. అయితే అలాంటి గ్రేట్ క్రికెటర్‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఘోరంగా అవమానించింది. దీంతో అటు నెటిజన్లు, సగటు క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌పై #ShameOnPCB అంటూ మండిపడుతున్నారు. ఆగస్టు 15న తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీసీబీ తమ ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసిన ఓ వీడియోనే దీనంతటికీ మూల కారణమని చెప్పుకోవాలి.
అసలు ఆ వీడియోలో ఎందుకు వివాదంగా మారిందంటే.. ‘చరిత్ర అనేది ఒక్క రోజులోనే సృష్టించబడేది కాదు’ కాదు అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పాక్ తరఫున ఇప్పటివరకు ఆడిన, ఆడుతున్న ప్లేయర్ల విజయాలను ప్రస్తావిస్తూ కంప్లీసన్ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో పాక్ మాజీ ప్రధాని, ‘తోషాఖానా’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను చూపించలేదు. దీంతో దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన క్రికెట్ లెజెండ్‌కి ఇది ఘోర అవమానమని, ఇలా చేయడం వెనుక పాక్ ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీ మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ కూడా వెంటనే ఆ వీడియోను తొలగించాలని డిమాండ్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
పీసీబీ వీడియో..
Making history isn’t just about one day, it’s about the legends we create and the tales we script 💫
🏆 Pakistan Cricket Team – a legacy that echoes through time 🌟#BeyondJustOneDay pic.twitter.com/grC0YVC5Xi
— Pakistan Cricket (@TheRealPCB) August 14, 2023
‘ఇమ్రాన్ ఖాన్ లేని ఇలాంటి వీడియోలను పెట్టడం బాధాకరం. వెంటనే ఈ వీడియోను పీసీబీ తొలగించాలి. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ ప్రోమోలో పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజామ్‌ను సరిగ్గా చూపించలేదని విమర్శించాం. అలాంటిది క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌కి ఇలాంటి అవమానం సహేతుకం కాదు. మీకు ఇమ్రాన్‌తో ఏమైనా రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు. పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్‌గా దేశానికి వన్నె తెచ్చిన లెజెండ్‌ని ఇలా అవమానించడం తగద’ని మహమూద్ పీసీబీకి హితవు పలికాడు.
Ex-chairman Mahmood criticises PCB for ignoring Imran Khan’s contribution in I-Day video#ImranKhan #KhalidMahmood #Cricket #WorldCup #ICC https://t.co/ehcwWTct4n
— NewsDrum (@thenewsdrum) August 16, 2023
పాక్ క్రికెట్ బోర్డ్ వీడియో ట్వీట్‌ను చూసిన వసీమ్ అక్రమ్ కూడా స్పందించాడు. ఇమ్రాన్ ప్రపంచ స్థాయి ఆటగాడని, పాక్ బోర్డ్ వెంటనే వీడియోను డిలీట్ చేసి అతనికి క్షమాపణలు చెప్పాలంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ డిమాండ్ చేశాడు.
After long flights and hours of transit before reaching Sri Lanka, I got the shock of my life when I watched PCB’s short clip on the history of Pakistan cricket minus the great Imran Khan… political differences apart but Imran Khan is an icon of world cricket and developed…
— Wasim Akram (@wasimakramlive) August 16, 2023
క్రికెట్ దిగ్గజం..
The greatest cricket ever. You puppet can’t minus Imran Khan . Sham on you PCB 🤚#غلام_نہیں_آزاد_پاکستان#ShameOnPCB#11thHour#قوم_کی_شَہ_رَگ_عمران_خان#ریاست_بچ_گئی_ہے#بائیکاٹ_کرکٹ#ارسلان_کو_انصاف_دو pic.twitter.com/d326CJkiQD
— SAFEER AZAM (@SAFEERAZAM15) August 16, 2023
అతనో చరిత్ర..
You can’t minus him from ANYWHERE. He is there, he is the history, present and reality! Stop living in your small heads!
He is engraved in every cricket lover’s memories. You will lose your own identity by airbrushing history. #ShameOnPCB#بائیکاٹ_کرکٹ#NoKhanNoPCBSupport pic.twitter.com/9ryg7TZRas
— Ammara Kh. (@anonconformist_) August 16, 2023
రియల్ లెజెండ్
We know the real legend. #Khan#ShameOnPCB#PetrolDieselPrice pic.twitter.com/Elyj74x8Ym
— Waseem Shigri (@wasimshigri) August 16, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..