15 ఏళ్లుగా నిరంతరాయంగా క్రికెట్‌ ఆడుతున్న దిగ్గజ క్రికెటర్‌.. ఇప్పుడిక రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా..!

| Edited By: Ravi Kiran

Dec 24, 2021 | 6:55 AM

Shakib Al Hasan: బంగ్లాదేశ్ క్రికెట్‌ దిగ్గజం షకీబ్ అల్ హసన్ నిరంతరం క్రికెట్ ఆడుతూ అలసిపోయాడు. ఈ పరిస్థితిలో అతను రిటైర్మెంట్ గురించి

15 ఏళ్లుగా నిరంతరాయంగా క్రికెట్‌ ఆడుతున్న దిగ్గజ క్రికెటర్‌.. ఇప్పుడిక రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా..!
Shakib Al Hasan
Follow us on

Shakib Al Hasan: బంగ్లాదేశ్ క్రికెట్‌ దిగ్గజం షకీబ్ అల్ హసన్ నిరంతరం క్రికెట్ ఆడుతూ అలసిపోయాడు. ఈ పరిస్థితిలో అతను రిటైర్మెంట్ గురించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. షకీబ్ మూడు ఫార్మాట్లలో క్రమం తప్పకుండా జట్టులో పాల్గొంటున్నాడు. 2006లో బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడలేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

ఢాకాకు చెందిన టీవీ ఛానెల్ NTVతో మాట్లాడిన షకీబ్.. ‘ఏ ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు. నేను టెస్ట్ క్రికెట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేను టెస్టు ఆడతానో లేదో, అలాగే వన్డేల్లో పాల్గొనాలా వద్దా అనేది కూడా ఆలోచించాలి. నేను టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పడం లేదు. 2022 T20 ప్రపంచకప్ తర్వాత నేను T20Iలు ఆడటం మానేయడం జరగవచ్చు. నేను టెస్టు, వన్డే ఆడగలను. అయితే మూడు ఫార్మాట్లలో ఆడటం దాదాపు అసాధ్యం. 40-42 రోజుల్లో రెండు టెస్టులు ఆడినా ప్రయోజనం ఉండదు. నేను ఖచ్చితంగా BCBతో ప్లాన్ చేసి ముందుకు వెళ్తాను’ అని చెప్పాడు.

అయితే పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే షకీబ్ తన రిటైర్మెంట్‌ను సూచించాడు. గల్ఫ్ న్యూస్‌తో సంభాషణలో అతను ఇలా అన్నాడు. ‘నేను మునుపటిలా నాన్‌స్టాప్ క్రికెట్ ఆడలేనని అనిపిస్తోంది. దీని గురించి నా కోచ్, ఫిజియోతో మాట్లాడతాను. ఈ సమయంలో నేను ఏ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలో తెలియడం లేదు. కానీ భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా గాయం కారణంగా నా కెరీర్ చాలా ప్రభావితమైంది. అయినా ఇంకా ఆటపై మక్కువ తగ్గలేదు. ఈ గాయం కొత్తదే అయినా నేను కోలుకుంటున్నాను’ అని తెలిపాడు.

PM Modi: వినియోగదారులకు శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..

‘రైతు అంటే పేదవాడు’ అనే భావన విడనాడాలి.. ఎందుకో కారణం చెప్పిన కేంద్ర మంత్రి

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..