
MCA Men’s U19 Cricket: మలేషియన్ మెన్స్ అండర్-19 ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో సంచలన విజయం నమోదైంది. సెలాంగోర్ అండర్-19 జట్టు, పుత్రజయ అండర్-19 జట్టుపై ఏకంగా 477 పరుగుల భారీ తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో సెలాంగోర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అక్రమ్ అబ్ద్ మలేక్ కేవలం 97 బంతుల్లో 217 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సెలాంగోర్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 564 పరుగులను నమోదు చేసింది. ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం మహ్మద్ అక్రమ్ అబ్ద్ మలేక్ మెరుపు డబుల్ సెంచరీ.
మహ్మద్ అక్రమ్ ఆడిన ఇన్నింగ్స్ ఒక సునామీని తలపించింది. కేవలం 97 బంతుల్లోనే 217 పరుగులు సాధించి, పుత్రజయ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని దూకుడుతో సెలాంగోర్ జట్టు 11కు పైగా రన్ రేట్‌తో పరుగులు చేసింది. అక్రమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సెలాంగోర్ జట్టు రికార్డు స్కోరును చేరుకుంది.
సెలాంగోర్ నిర్దేశించిన 565 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుత్రజయ జట్టు పూర్తిగా తడబడింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన పుత్రజయ, సెలాంగోర్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేకపోయింది. చివరికి, పుత్రజయ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ఫలితంగా, సెలాంగోర్ జట్టు 477 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇంత భారీ తేడాతో గెలిచిన సందర్భాలు చాలా అరుదు. ఈ విజయం, ముఖ్యంగా మహ్మద్ అక్రమ్ అబ్ద్ మలేక్ అసాధారణ ప్రదర్శన, అండర్-19 క్రికెట్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అతని డబుల్ సెంచరీ రాబోయే రోజుల్లో అతనిపై దృష్టి సారించేలా చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..