IND vs WI: 27 మ్యాచ్‌లు, 13 సెంచరీలు, 3505 పరుగులు.. మరోసారి దేశవాళీ స్టార్‌కు మొండిచేయి.. ఫైరవుతోన్న నెటిజన్లు..

|

Jun 24, 2023 | 5:10 AM

India Test Squad vs West Indies: 16 మంది సభ్యుల టెస్ట్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ అవకాశం పొందలేకపోయాడు. దీంతో టీమిండియా అభిమానులకు కోపం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

IND vs WI: 27 మ్యాచ్‌లు, 13 సెంచరీలు, 3505 పరుగులు.. మరోసారి దేశవాళీ స్టార్‌కు మొండిచేయి.. ఫైరవుతోన్న నెటిజన్లు..
Team India
Follow us on

వెస్టిండీస్‌తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల విదేశీ సిరీస్ కోసం బీసీసీఐ టెస్ట్, వన్డే జట్టును ప్రకటించింది. ముఖ్యంగా టెస్టు సిరీస్ కోసం పలువురు కొత్త ముఖాలకు ప్రాధాన్యతనిచ్చిన సెలక్షన్ బోర్డు.. పేలవ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. అలాంటి ఆటగాళ్లలో ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ కూడా ఉన్నారు. ముందుగా ఊహించినట్లుగానే ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతుర్‌రాజ్ గైక్వాడ్‌లు టీమ్‌ ఇండియాలోకి అడుగుపెట్టగలిగారు. కానీ, 16 మంది సభ్యులతో కూడిన టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ అవకాశం పొందలేకపోయాడు. దీంతో టీమిండియా అభిమానులకు కోపం వచ్చింది.

ఊహించిన విధంగానే, టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి ఎడిషన్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అజింక్యా రహానె జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే జట్టు ఎంపికకు ముందే టెస్టు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో అత్యంత కీలకమైన సర్ఫరాజ్ ఖాన్‌కు బీసీసీఐ మరోసారి అన్యాయం చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

13 సెంచరీలతో 3505 పరుగులు..

25 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. దీంతో టెస్టు జట్టుకు ఎంపికవుతాడన్న అంచనాలు నెలకొన్నాయి. ముంబై బ్యాట్స్‌మెన్ 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 13 సెంచరీలతో 79.65 సగటుతో 3505 పరుగులు చేశాడు. అయితే ఇప్పటికీ భారత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఆ యువ క్రికెటర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపింది. అందుకే టీమ్‌ను ప్రకటించిన తర్వాత బీసీసీఐపై నెటిజన్లు ట్వీట్లతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెటిజన్ల ఆగ్రహం..

సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సెలక్షన్ బోర్డును టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌లో మెరిసిన వారికే ఈ సెలక్షన్ బోర్డు అనుమతిస్తోందని విమర్శించారు. మరికొందరు అద్భుత ప్రతిభను బీసీసీఐ పట్టించుకోలేదని ఆరోపించారు. అలాంటి కొన్ని ట్వీట్లు ఇప్పుడు చూద్దాం..

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..