ఆఖరి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి నిరాశేనా..? శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..!

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం జరగనున్న ఆఖరి టీ20 పోరుకు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. రెండో టీ20లో మెరుపు అర్థశతకంతో కదం తొక్కిన ఆయన, 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రశంసిస్తూ జట్టులో చోటు కోసం నెలకొన్న తీవ్ర పోటీని వివరించారు.

ఆఖరి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి నిరాశేనా..? శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..!

Updated on: Sep 17, 2026 | 6:40 AM

India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) తో జరిగిన రెండో టీ20లో 22 బంతుల్లోనే 57 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 17 గురువారం నాడు జరగబోయే మూడో టీ20 ముందు ఆయన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భారత జట్టును నడపడం అంత తేలికైన విషయం కాదని, 15 ఏళ్ల కుర్రాడు 700-800 పరుగులు సాధిస్తూ దూసుకొస్తుంటే పోటీ తప్పదని ఆయన పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) ముందు టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సమయంలో తాను రాణించినప్పటికీ, ఆ తర్వాత రెండు మూడు మ్యాచ్‌లలో సరిగ్గా ఆడకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలు మారడం సహజమేనని చెప్పాడు. లీగ్‌లో సారథిగా ఉంటూ తాను కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, నాయకత్వ బృందం పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని సంజు స్పష్టం చేశాడు.

మొదటి రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మూడో టీ20లోనూ తుది జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ అదిరిపోయే ఫామ్‌లో ఉండటంతో ప్రస్తుత జోడీని మార్చే సాహసం యాజమాన్యం చేయడం లేదు. ఆసియా క్రీడలు (Asian Games) ప్రారంభం కావడానికి ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం తో, మెగా ఈవెంట్ లోపల వైభవ్‌కు అవకాశం ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధత కొనసాగుతోంది.

ఇదే సమయంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ప్రధాన బృందంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) టోర్నీకి దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ విప్రజ్ నిగమ్ (Vipraj Nigam) జట్టులోకి ఎంపికయ్యాడు.

ఆసియా క్రీడల తుది జట్టు వివరాలు ఇలా ఉన్నాయి: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us