AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: వరుణ్ చక్రవర్తి ఔట్.. టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!

Asian Games 2026: ఆసియా క్రీడల కోసం టీమిండియా జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి తప్పుకోగా, అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. నితీష్ కుమార్ రెడ్డిని ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించి వన్డే స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు.

Asian Games 2026: వరుణ్ చక్రవర్తి ఔట్.. టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
Asian Games 2026 (1)
Rakesh
|

Updated on: Sep 17, 2026 | 7:10 AM

Share

Asian Games 2026: జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడల (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. స్టార్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జపాన్‌తో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌తో పాటు ఆసియా క్రీడల టోర్నమెంట్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ బుధవారం (సెప్టెంబర్ 16) అధికారికంగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

తొలిసారి టీమిండియాలోకి ఎంట్రీ

వరుణ్ చక్రవర్తి గాయపడి జట్టు నుంచి తప్పుకోవడంతో, సెలక్టర్లు ఆయన స్థానంలో ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించే యువ స్పిన్ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌ను (Vipraj Nigam) సెలక్ట్ చేశారు. విప్రాజ్ నిగమ్‌కు భారత జాతీయ జట్టులో పిలుపురావడం ఇదే మొదటిసారి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు తరఫున ఆడుతున్న ఈ యంగ్ ఆల్‌రౌండర్, గత సీజన్‌లో తన అద్భుతమైన బౌలింగ్ వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ వేగంగా పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడైన ప్రదర్శన కనబరచడంతోనే అతనికి ఈ గోల్డెన్ ఛాన్స్ లభించింది.

నితీష్ కుమార్ రెడ్డికి వన్డే జట్టులో చోటు

ఈ టోర్నమెంట్‌కు సంబంధించి బీసీసీఐ మరో కీలక మార్పు కూడా చేసింది. మొదట ఆసియా క్రీడల టీ20 జట్టులో చోటు దక్కించుకున్న యువ పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(Nithish Kumar Reddy)ని ఇప్పుడు ఆ జట్టు నుంచి విడుదల చేశారు. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న నూతన వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత వన్డే జట్టులో నితీష్‌కు స్థానం కల్పించారు. ఇక జపాన్‌లోని ఐచి-నాగోయా నగరంలో జరగనున్న ఈ ఆసియా క్రీడలకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. గత టోర్నమెంట్‌లో పురుషుల, మహిళా జట్లు రెండు కూడా స్వర్ణ పతకాలను (Gold Medals) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆసియా క్రీడల కోసం అప్‌డేట్ చేసిన టీమిండియా జట్టు

జట్టు వివరాలు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?