IPL 2022: షేన్‌వార్న్ కెప్టెన్సీలో కప్‌ గెలిచిన రాజస్థాన్‌.. అప్పుడు సంజూ శాంసన్‌ ఏం చేస్తున్నాడో తెలుసా..?

IPL 2022: ఐపీఎల్‌ మొదటి సీజన్ 2008లో జరిగింది. ఇందులో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తొలి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ సమయంలో ప్రస్తుత కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఏం చేస్తున్నాడో చెప్పాడు.

IPL 2022: షేన్‌వార్న్ కెప్టెన్సీలో కప్‌ గెలిచిన రాజస్థాన్‌.. అప్పుడు సంజూ శాంసన్‌ ఏం చేస్తున్నాడో తెలుసా..?
Sanju Samson

Updated on: May 28, 2022 | 11:44 AM

IPL 2022: ఐపీఎల్‌ మొదటి సీజన్ 2008లో జరిగింది. ఇందులో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తొలి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ సమయంలో ప్రస్తుత కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఏం చేస్తున్నాడో చెప్పాడు. రెండో క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన తర్వాత శాంసన్‌ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. “నేను కేరళలో ఎక్కడో అండర్ 16 ఫైనల్ ఆడుతున్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున షేన్ వార్న్, సోహైల్ తన్వీర్ IPL 2008 ఫైనల్‌లో గెలుపొందడం చూశాను. అప్పుడు సంజూ శాంసన్ చిన్న పిల్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిని విషయం తెలిసిందే. రాజస్థాన్ జట్టు ఈ ముఖ్యమైన పోరులో 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ “మేము ఐపీఎల్‌లో పునరాగమనం చేయడం అలవాటు చేసుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నీ కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. పిచ్‌పై బౌన్స్ కూడా స్పిన్నర్లకు ఉపయోగపడింది. ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు” అని చెప్పాడు.

ఇక ఈ సీజన్‌లో బట్లర్ ఫామ్‌లో ఉండటం రాజస్థాన్‌కి కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో జోస్‌ బట్లర్‌ 824 పరుగులు చేశాడు. ఒకే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. ఆ తర్వాత డెవిడ్ వార్నర్‌ ఉన్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. కోహ్లీ 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు. ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు డెవిడ్‌ వార్నర్‌ 848 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి