IND vs SA 2nd T20I: శాంసన్‌కు మళ్లీ నిరాశే.. ప్లేయింగ్ 11లో ఫ్లాప్ ప్లేయర్‌కు మరో ఛాన్సిచ్చిన గంభీర్..?

IND vs SA 2nd T20I: సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన, రెండో మ్యాచ్‌లోనూ గెలిచి పట్టు సాధించాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన అంచనా జట్టు (India Predicted Playing XI) మరోసారి సంజు శాంసన్ అభిమానులకు నిరాశ కలిగించేలా ఉంది.

IND vs SA 2nd T20I: శాంసన్‌కు మళ్లీ నిరాశే.. ప్లేయింగ్ 11లో ఫ్లాప్ ప్లేయర్‌కు మరో ఛాన్సిచ్చిన గంభీర్..?
Ind Vs Sa 2nd T20i

Updated on: Dec 11, 2025 | 1:28 PM

IND vs SA 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 101 పరుగుల భారీ విజయం సాధించిన టీమిండియా.. గురువారం ముల్లాన్‌పూర్‌లో జరగనున్న రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన, రెండో మ్యాచ్‌లోనూ గెలిచి పట్టు సాధించాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన అంచనా జట్టు (India Predicted Playing XI) మరోసారి సంజు శాంసన్ అభిమానులకు నిరాశ కలిగించేలా ఉంది.

సంజు శాంసన్‌కు ‘నో’ ఛాన్స్?: తొలి మ్యాచ్‌లో వికెట్ కీపర్ జితేష్ శర్మ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్నే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జితేష్ శర్మకే వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించి, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు భావిస్తోంది. ఇది సంజుకు నిజంగా ‘హార్ట్‌బ్రేక్’ లాంటి వార్తే.

తుది జట్టులో మార్పులు ఉంటాయా?

ఇవి కూడా చదవండి

ఓపెనర్లు: తొలి మ్యాచ్‌లో విఫలమైనా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. ముఖ్యంగా గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నా, అతనికి మరో అవకాశం దక్కనుంది.

స్పిన్ విభాగం: ముల్లాన్‌పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, తుది జట్టులో చిన్న మార్పు జరిగే ఛాన్స్ ఉంది. శివమ్ దూబే లేదా వరుణ్ చక్రవర్తి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

కీలక ఆటగాళ్లు: హార్దిక్ పాండ్యా తన ఆల్ రౌండర్ షోతో అదరగొడుతుండగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు.

భారత అంచనా జట్టు (Predicted XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/కుల్దీప్ యాదవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

మొత్తానికి విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాలని భారత్ యోచిస్తోంది. అదే జరిగితే సంజు శాంసన్ తుది జట్టులో చోటు కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.