గత కొన్ని రోజులుగా టీమిండియాపై వరుస విమర్శలు వస్తున్నాయి. అభిమానుల భారత క్రికెట్ జట్టును బాగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం. టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఘోర పరాజయం, కొందరు ఆటగాళ్ల పేలవ ప్రదర్శన ఇందులో కొన్ని. వీటితో పాటు కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్‌పై కూడా తరచూ విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియాలో సంజూ శాంసన్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐర్లాండ్ టూర్, టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనల్లోనూ అతనికి మొండిచేయి చూపడంపై గుర్రుగా ఉంటున్నారు. అదే సమయంలో ‘టీమిండియాలో ఆడినా, ఆడకున్నా సంజూకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని అతని అభిమానులు సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడీ సంజూపై ప్రేమాభిమానాలు ఖతార్ దాకా వెళ్లాయి. అక్కడ జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అభిమానులు సంజూ పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భారత జట్టు ఆడనప్పటికీ, వందలాది మంది భారత ఫుట్‌బాల్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూస్తున్నార. అక్కడకు వెళ్లలేని సాకర్ అభిమానులు టీవీల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు చూస్తున్నారు.ఈ సమయంలో ఖతార్ చేసుకున్న ఫుట్‌బాల్ ప్రేమికులు తమ ఆభిమాన క్రికెటర్లపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. శనివారం ఓ అభిమాని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీతో బ్రెజిల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఇప్పుడు సంజూ శాంసన్ ఫ్యా్న్స్ పోస్టర్లతో ఈ యంగ్ ప్లేయర్‌పై తమ అభిమానం చాటుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సారథ్యం వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ చిత్రాలను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ప్రపంచ కప్‌లో కూడా సంజుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.
భారత జట్టులో సంజూ ప్రదర్శన గురించి మాట్లాడితే, కేరళకు చెందిన ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్‌ను న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జట్టులోకి వచ్చాడు. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి అవకాశం రాలేదు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో సంజుకు అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో అతను 36 పరుగులతో రాణించాడు. అయితే రెండవ మ్యాచ్‌లో మళ్లీ అతనిని తప్పించారు. ఇదిఅతని అభిమానులను, క్రికెట్ నిపుణులను షాక్‌కు గురిచేసింది.
Everybody: Who are you supporting at the FIFA World Cup?
Us: pic.twitter.com/e66NRg78dh
— Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..