చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాడ్‌లక్కోడు.. దెబ్బకు దశతిరిగిందిగా.. ఐపీఎల్ హిస్టరీలోనే తోపుగాడిగా రికార్డ్

Sanju Samson Breaks Cameron Green IPL Record: ఈ బ్లాక్‌బస్టర్ ట్రేడ్‌తో సంజు శాంసన్ తన 12 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని రాజస్థాన్ రాయల్స్‌తో ముగించుకున్నాడు (ఫ్రాంచైజీ సస్పెన్షన్ పీరియడ్ మినహా). ఈ ట్రేడ్ లీగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆటగాళ్ల మార్పిడి ఒప్పందంగా మారింది.

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాడ్‌లక్కోడు.. దెబ్బకు దశతిరిగిందిగా.. ఐపీఎల్ హిస్టరీలోనే తోపుగాడిగా రికార్డ్
Sanju Samson

Updated on: Nov 18, 2025 | 12:40 PM

Sanju Samson Breaks Cameron Green IPL Record: క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ, స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఒక భారీ రికార్డును నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు మారిన సంజు శాంసన్, రూ.18 కోట్లు జీతంతో ట్రేడ్ అయిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. ఈ బ్లాక్‌బస్టర్ ట్రేడ్‌తో సంజు శాంసన్ తన 12 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని రాజస్థాన్ రాయల్స్‌తో ముగించుకున్నాడు (ఫ్రాంచైజీ సస్పెన్షన్ పీరియడ్ మినహా). ఈ ట్రేడ్ లీగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆటగాళ్ల మార్పిడి ఒప్పందంగా మారింది.

కామెరూన్ గ్రీన్ రికార్డు బ్రేక్..

సంజు శాంసన్ ట్రేడ్ అయిన రూ. 18 కోట్ల జీతం, గతంలో కామెరూన్ గ్రీన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి రూ. 17.5 కోట్లకు ట్రేడ్ అయిన గ్రీన్, అప్పటివరకు అత్యంత ఖరీదైన ట్రేడ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డును సంజు శాంసన్ అధిగమించాడు. ఈ జాబితాలో రూ. 15 కోట్ల ట్రేడ్‌తో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు 2024) మూడవ స్థానంలో ఉన్నాడు.

ప్లేయర్ స్వాప్ వివరాలు..

సంజు శాంసన్‌కు బదులుగా, చెన్నై నుంచి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

రవీంద్ర జడేజా(Ravindra Jadeja) – సామ్ కరన్ (Sam Curran)..

సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వద్ద తీసుకుంటున్న రూ. 18 కోట్ల జీతాన్నే చెన్నైలోనూ కొనసాగించనుండగా, రవీంద్ర జడేజా మాత్రం రాజస్థాన్ రాయల్స్‌లో చేరడం కోసం తన వేతనంలో కోత విధించుకున్నారు. 2025 సీజన్‌లో చెన్నై వద్ద రూ.18 కోట్లు అందుకున్న జడేజా, ఇప్పుడు రాజస్థాన్‌ తరపున రూ. 14 కోట్లు మాత్రమే తీసుకోనున్నారు.

చెన్నై హిస్టరీలో రెండవ ట్రేడ్ మాత్రమే..

ఆశ్చర్యకరంగా, IPL చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసిన రెండవ ఆటగాడు సంజు శాంసన్ మాత్రమే. గతంలో, 2021లో రాజస్థాన్ రాయల్స్ నుంచే వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన రాబిన్ ఊతప్పను చెన్నై కొనుగోలు చేసింది. ఊతప్పను రూ. 3 కోట్లకే ట్రేడ్ చేయగా, సంజు శాంసన్ రూ. 18 కోట్లతో CSK చరిత్రలోనే అత్యంత ఖరీదైన ట్రేడ్ డీల్‌గా నిలిచాడు.

IPLలో అత్యంత ఖరీదైన ట్రేడ్ ప్లేయర్‌లు (జీతం ఆధారంగా)..

సంజు శాంసన్, రూ. 18 కోట్లు, (CSK – RR 2026)

కామెరూన్ గ్రీన్, రూ. 17.5 కోట్లు, (RCB – MI,2024)

హార్దిక్ పాండ్యా, రూ. 15 కోట్లు, (MI – GT,2024)

రవీంద్ర జడేజా, రూ. 14 కోట్లు, (RR – CSK,2026)

శార్దూల్ ఠాకూర్, రూ. 10.75 కోట్లు,( KKR – DC,2023).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..