Sania Mirza: క్రికెట్‌లోకి హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌.. ఆర్బీబీ జట్టుకు ఎంపిక.. పోస్ట్‌ వైరల్‌

ఇప్పుడీ క్రేజీ ఆర్సీబీ జట్టులోకి హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వచ్చి చేరింది. అదేంటి ఆమె టెన్నిస్‌ క్రీడాకారిణి కదా. ఆమె క్రికెట్‌ ఎలా ఆడుతుంది? అని చాలామందికి డౌట్‌ రావచ్చు.

Sania Mirza: క్రికెట్‌లోకి హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌.. ఆర్బీబీ జట్టుకు ఎంపిక.. పోస్ట్‌ వైరల్‌
Sania Mirza
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2023 | 11:25 AM

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అలియాస్‌ ఆర్‌సీబీ.. ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీని గెలవకపోయినా ఈ జట్టుకు ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకు కారణం ఆ జట్టు ఆటగాళ్లే.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌.. ఇలా చెప్పుకుంటూ ఎంతో మంది స్టార్‌ ప్లేయర్లు ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇక దీనికి కొనసాగింపుగా పలువురు మహిళా క్రికెటర్లు బెంగళూరు జట్టుతో చేరనున్నారు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానతో పాటు రేణుకాసింగ్‌, రిచాఘోష్‌ వంటి క్రికెటర్లు త్వరలోనే ఆర్సీబీ జెర్సీతో కనిపించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీతోపాటు సోఫీ డివైన్, హేథర్ నైట్, మేగన్ స్కాట్ తదితర మహిళా క్రికెటర్లు కూడా ఈ జట్టుకే ఆడనున్నారు. ఇప్పుడీ క్రేజీ ఆర్సీబీ జట్టులోకి హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వచ్చి చేరింది. అదేంటి ఆమె టెన్నిస్‌ క్రీడాకారిణి కదా. ఆమె క్రికెట్‌ ఎలా ఆడుతుంది? అని చాలామందికి డౌట్‌ రావచ్చు.అయితే సానియా ప్లేయర్‌గా కాకుండా మహిళా ఐపీఎల్‌ జట్టుకు మెంటార్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్సీబీ జెర్సీలో ఉన్ ఫొటోతో పాటు ఓ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బెంగళూరు జట్టుకు మెంటార్ గా ఎంపికవ్వడం ఆనందంగా ఉందని ఈ పోస్టులో చెప్పుకొచ్చింది సానియా.

ఇదిలా ఉంటే వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌కు అధికారిక ముహూర్తం ఖరారైంది. మార్చి 4 నుంచి ఈ క్రికెట్‌ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం 23 రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి . తొలి మ్యాచ్.. గుజరాత్, ముంబయి జట్ల మధ్య జరగనుంది. మార్చి 26న ఫైనల్ పోరు ఉండనుంది. అన్ని మ్యాచులు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ మెగా క్రికెట్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..