11 Sixes in 12 Balls : 12 బంతుల్లో 11 సిక్స్‌లు.. ఒకే ఓవర్‌లో 40 పరుగులు..ఇది మామూలు విధ్వంసం కాదు

భారతదేశంలో టాలెంట్‌కు ఏ మాత్రం కొదవలేదు. రోజుకో కొత్త స్టార్ వెలుగులోకి వస్తున్నాడు. ప్రస్తుతం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఇక్కడ పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. కేరళ క్రికెట్ లీగ్‌లో ఇప్పుడు సల్మాన్ నిజామ్ పరుగుల సునామీ క్రియేట్ చేశాడు. సల్మాన్ చివరి 12 బంతుల్లో 11 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

11 Sixes in 12 Balls : 12 బంతుల్లో 11 సిక్స్‌లు.. ఒకే ఓవర్‌లో 40 పరుగులు..ఇది మామూలు విధ్వంసం కాదు
11 Sixes In 12 Balls

Updated on: Aug 30, 2025 | 7:23 PM

11 Sixes in 12 Balls : మన దేశంలో టాలెంటుకు కొరత లేదు. ఈ దేశంలో ప్రతిరోజూ కొత్త కొత్త స్టార్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అనేక రాష్ట్రాలలో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఇక్కడ పరుగుల సునామీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కేరళ క్రికెట్ లీగ్‌లో సల్మాన్ నిజార్ బ్యాటింగ్ తుఫాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సల్మాన్ చివరి 12 బంతుల్లో 11 సిక్స్‌లు కొట్టి ఒక రికార్డు సృష్టించాడు. దీంతో ఒకే ఓవర్‌లో 40 పరుగులు రాబట్టాడు.

కేరళ క్రికెట్ లీగ్‌లో అదానీ తిరువనంతపురం రాయల్స్, కలికట్ గ్లోబ్‌స్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులకు ఒక అద్భుతమైన ఎక్స్‎పీరియన్స్ ఎదురైంది. కలికట్ గ్లోబ్‌స్టార్ జట్టు 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో 13 బంతుల్లో 17 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్న సల్మాన్ నిజార్‌పై అందరి ఆశలు నిలిచాయి.

19వ ఓవర్‌లో సల్మాన్ మొదట 5 సిక్స్‌లు కొట్టి, చివరి బంతికి ఒక పరుగు తీసుకున్నాడు. ఆ తర్వాత చివరి ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవర్‌లో ఒక నోబాల్, వైడ్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఒకే ఓవర్‌లో ఏకంగా 40 పరుగులు వచ్చాయి. సల్మాన్ చివరి 12 బంతుల్లో 11 సిక్స్‌లు కొట్టాడు. ఈ రెండు ఓవర్లలో మొత్తం 71 పరుగులు వచ్చాయి. దీంతో అతని జట్టు 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. సల్మాన్ కేవలం 26 బంతుల్లోనే 86 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.

సల్మాన్ నిజార్ తన 86 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం 12 భారీ సిక్స్‌లు కొట్టాడు. ఈ కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్‌లో సల్మాన్ విధ్వంసం క్రియేట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అతను 26 బంతుల్లో అజేయంగా 48 పరుగులు, 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇదే సీజన్‌లో మరోసారి అతను 44 బంతుల్లో 77 పరుగులు కూడా చేశాడు. ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సల్మాన్‌ను ట్రయల్స్‌కు పిలిచింది. అతని ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ 2026 వేలంలో భారీ మొత్తం పలికే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి