AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: సాయి సుదర్శన్‌ సూపర్‌ సెంచరీ.. డేంజర్‌లో ఆ ఇద్దరి కెరీర్‌? కోహ్లీ, రోహిత్‌ లేరనే భయం వద్దు..

ఐపీఎల్‌లో సాయి సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శనతో సెంచరీ సాధించాడు. అతని నిలకడైన ప్రదర్శన యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మల భారత జట్టులో స్థానాలకు ముప్పు తెచ్చిపెడుతుందా అన్నది చర్చనీయాంశం. ఓపెనర్లుగా, లెఫ్ట్ హ్యాండర్లుగా ముగ్గురూ పోటీపడుతున్నారు. సుదర్శన్‌ కన్సిస్టెన్సీ, టాలెంట్‌ భారత జట్టుకు గొప్ప ఆస్తి అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

IPL 2025: సాయి సుదర్శన్‌ సూపర్‌ సెంచరీ.. డేంజర్‌లో ఆ ఇద్దరి కెరీర్‌? కోహ్లీ, రోహిత్‌ లేరనే భయం వద్దు..
Sai Sudharsan
SN Pasha
|

Updated on: May 19, 2025 | 5:30 PM

Share

ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్నాడు.. కానీ, దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేదు. అతనికి పెద్దగా ఫ్యాన్‌ బేస్‌ లేదు, పీఆర్‌ ఏజెన్సీ అస్సలే లేదు. అతని వద్ద ఉన్నది ఒక్కటే టాలెంట్‌. దాన్నే నమ్మకున్నాడు.. ఐపీఎల్‌ని దున్నేస్తున్నాడు. చూడ్డానికి చాలా కూల్‌ అండ్‌ కామ్‌గా ఉంటాడు.. బ్యాటింగ్‌ కూడా క్లాస్‌గా చేస్తాడు.. కానీ, అతని కన్సిస్టెన్సీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. నిలబడ్డాడంటే.. ఎదురుగా ఎలాంటి బౌలర్‌ ఉన్నా లెక్క చేయడు. ఓ సీనియర్‌ డాక్టర్‌ సర్జరీ చేస్తున్నట్లు, ఓ తోట మాలి గులాబీ మొక్క నాటుతున్నట్లు చాలా ఓపిగ్గా, జాగ్రత్తగా, అందంగా షాట్లు ఆడేస్తుంటాడు. అడ్డదిడ్డంగా ఊపడం, కిందా మీదా పడి షాట్లు ఆడటం లాంటివి చేయడు.. క్రికెట్‌ను క్రికెట్‌లా ఒక నిఖార్సైయిన బ్యాటర్ల పరుగుల వరద పారిస్తాడు. పిచ్చి పిచ్చి షాట్లు, అడ్డిగుడ్డి బ్యాటింగే టీ20 క్రికెట్‌ అనుకుంటున్న వారికి అతను స్టార్‌ క్రికెటర్‌ కాకపోవచ్చు.. కానీ, రాసి పెట్టుకోండి.. ఓ 15, 20 ఏళ్ల తర్వాత గొప్ప గొప్ప క్రికెటర్ల లిస్ట్‌లో అతని పేరు కూడా ఉంటుంది. ఆ పేరు భరద్వాజ్ సాయి సుదర్శన్.

తాజాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు సాయి సుదర్శన్‌. 200 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 108 పరుగులు చేసి.. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. తన టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో పాటు ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్లతో టీమిండియా ఫ్యూచర్‌ ఏంటా అని కంగారు పడుతున్న క్రికెట్‌ అభిమానులకు నేనున్నానే నాయనమ్మా అంటూ కాస్త హోప్‌ ఇస్తున్నాడు. అయితే.. కుర్రాళ్ల మధ్య కాంపిటీషన్ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత పోటీలో కూడా సాయి సుదర్శన్‌కు ఉన్న అడ్వాంటేజ్‌ అతని కన్సిస్టెన్సీ. చాలా అద్బుతంగా ఆడుతున్నాడు. ఏదో ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మెరిసాం.. ఆ తర్వాత చల్లబడ్డాం అని కాకుండా.. నిలకడగా ప్రతీ మ్యాచ్‌లో తన కాంట్రిబ్యూషన్‌ ఇస్తూ.. అబ్బ ఈ ప్లేయర్‌ అయితే నమ్మకం పెట్టుకోవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తున్నాడు.

కోహ్లీపై ఎలాగైతే కోట్ల మంది నమ్మకం పెట్టుకున్నేవారో.. ఇప్పుడు సాయి సుదర్శన్‌ కూడా అలాంటి నమ్మకం సంపాదించేలా కనిపిస్తున్నాడు. అతనికి జాకీలు పెట్టి లేపే పెయిడ్‌ ఫ్యాన్స్‌ లేరు కానీ.. లేకుంటేనా ఈ పాటికి ఇండియా మొత్తం అతని పేరు మారుమోగిపోయేది. సరే ఆ పీఆర్‌ విషయం పక్కనపెడితే.. సాయి సుదర్శన్‌ సూపర్‌ ఫామ్‌ అతనికి మంచి చేస్తుందనే అనుకున్నా.. ఓ ఇద్దరు కుర్రాళ్ల కెరీర్‌ను మాత్రం డేంజర్లో పడనుంది. వాళ్లిద్దరూ ఎవరంటే.. యశస్వి జైస్వాల్‌, అభిషేక్‌ శర్మ. వీళ్లిద్దరూ కూడా తక్కువవాళ్లేం కాదు.. వాళ్లదైన రోజునా విధ్వంసం సృష్టించగలరు. కానీ టీమిండియాకు ఆడాలంటే ఇంకో క్వాలిటీ కావాలి. అది కన్సిస్టెన్సీ. ఇన్ని సార్లు ఈ మాట ఎందుకు వాడుతున్నాను అంటే.. సాయి సుదర్శన్‌ గురించి చెప్పాలంటే అతని టాలెంట్‌, కన్సిస్టెన్సీ గురించే చెప్పాలి. అలాగే మిగతా ప్లేయర్ల దగ్గర టాలెంట్‌ ఉన్నా కన్సిస్టెన్సీ మిస్‌ అవుతుంది. అదే ఇప్పుడు సాయి సుదర్శన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. సీనియర్ల రిటైర్మెంట్‌తో ఎలాగో కుర్రాళ్లకు టీమిండియాలో చోటు దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సాయి సుదర్శన్‌ ఈ రేంజ్‌ పర్ఫార్మెన్స్‌ కనబరుస్తుంటే.. ఇప్పటికే టీమిండియాలో చోటుపై బోలెడు ఆశలు పెట్టుకున్న జైస్వాల్‌, అభిషేక్‌కు.. సాయి నుంచి గట్టి పోటీ ఎదురు అవ్వడం ఖాయం. పైగా ఈ ముగ్గురు కూడా ఓపెనర్లు, లెఫ్ట్‌ హ్యాండర్లు. సో.. అందుకే సాయి సుదర్శన్‌ నుంచి ఎదురువుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే.. వాళ్లు కూడా కన్సిస్టెన్సీగా రన్స్‌ చేయాలి. పొరపాటున టీమిండియాలోకి వచ్చి శుబ్‌మన్‌ గిల్‌కు జోడిగా పాతుకుపోయాడంటే.. జైస్వాల్‌, అభిషేక్‌కు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌తో అతను గిల్‌కు జోడిగా ఆడుతున్నాడు. ఇద్దరు అద్భుతమైన ఓపెనింగ్‌ వికెట్‌ పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పుతున్నారు. పైగా రైట్‌ అండ్‌ లెఫ్‌ కాంబినేషన్‌, టీమిండియాకు ఫ్యూచర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. సో.. తనకు జోడిగా ఆల్రెడీ సక్సెస్‌ అయిన సాయి సుదర్శన్‌ ఉంటే బాగుంటుందని గిల్‌ అనుకుంటే.. మిగిలిన ఇద్దరికి టీమ్‌లో చోటు కష్టమే.

అయితే కుర్రాళ్ల మధ్య ఇంత హై కాంపిటీషన్‌ ఉండటం మాత్రం ఫైనల్‌గా టీమిండియాకు చాలా మంచిది. ప్రతి మ్యాచ్‌ కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాలనే భయం ఉంటుంది. ఎందుకంటే ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనా.. మన వెనుక ఇంకో సూపర్‌ ప్లేయర్‌ ఉన్నాడు.. అతనికి ఛాన్స్‌ ఇస్తారనే ఓ భయం ఉంటుంది. ఇక సెలెక్టర్లు పీఆర్‌ హైప్‌ చూసి, పక్షపాతం వహించకుండా.. కేవలం టాలెంట్, కన్సిస్టెన్సీ, పర్ఫార్మెన్స్‌ చూసి టీమిండియాలో చోటిస్తే.. కోహ్లీ, రోహిత్‌ లేని లోటు కనిపించకుండా భవిష్యత్తులో కూడా టీమిండియా.. వరల్డ్‌ క్రికెట్‌లో దూసుకెళ్లడం ఖాయం. ఇక ఫైనల్‌గా.. ఐపీఎల్‌లో అదరగొడుతూ.. ఇప్పటికే 600 కంటే ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్న సాయి సుదర్శన్‌కు టీమిండియా వన్డే, టెస్ట్‌ టీమ్స్‌లో కూడా చోటు దక్కాలని కోరుకుందాం.. ఆల్‌ ది బెస్ట్‌ టూ సాయి సుదర్శన్‌.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?