
ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ భావిస్తున్నారు… యువ బ్యాట్స్‌మన్ సాయి సుధర్శన్‌లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అన్ని లక్షణాలు ఉన్నాయని. టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ మే నెలలో రిటైర్మెంట్ ప్రకటించగా, అతని స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనే ప్రశ్నకు పనేసర్ సమాధానంగా సుధర్శన్‌ను ఎంచుకున్నారు.
రొహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు ఇది కొత్త శకం. శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా పదవిలోకి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనతో భారత్ కొత్త యుగాన్ని మొదలుపెట్టనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో సాయి సుధర్శన్‌కు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మూడు వన్డేలు, ఒక టీ20 ఆడారు.
“విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో, ఇప్పుడు భారత జట్టు కూడా అదే విధంగా టెస్ట్ క్రికెట్ ఆడాలని నేను ఆశిస్తున్నాను,” అని పనేసర్ InsideSportకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “తర్వాతి కోహ్లీ ఎవరు?” అన్న ప్రశ్నకు ఆయన బదులుగా సాయి సుధర్శన్ పేరును ఎంచుకున్నారు.
తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సుధర్శన్ ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 1957 పరుగులు సాధించారు. అతని బ్యాటింగ్ సగటు 39.93 కాగా, ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2024 కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్‌లో సయ్య్ సుధర్శన్ ఐదు ఇన్నింగ్స్‌లలో 165 పరుగులు చేశారు. నాటింగ్హామ్‌షైర్‌పై చేసిన సెంచరీ (105 పరుగులు – 178 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో) ప్రత్యేకంగా నిలిచింది.
“అతడు ఎంతో ఆత్మవిశ్వాసంగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. సరీ తరఫున అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీ నెంబరు 4లో వేసిన ముద్రను ఇప్పుడు ఈ యువ ఆటగాడు కొనసాగించగలడు,” అని మోంటీ పనేసర్ అన్నారు.
ఈ సిరీస్‌తో భారతదేశం, ఇంగ్లాండ్‌లు 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌ను ప్రారంభించనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడ్డింగ్్లీ వేదికగా ప్రారంభమవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..