ఐపీఎల్ 16వ సీజన్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు తాజా సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వృద్ధిమాన్ సాహా (14), శుభ్‌మన్ గిల్ (14), హార్ధిక్ పాండ్యా (5) తక్కువ స్కోరుకే ఔటైనా తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్(48 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. విజయ్‌శంకర్( 23 బంతుల్లో 29) కూడా రాణించగా, డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. దీంతో 11 బంతులు ఉండగానే హార్ధిక్ సేన విజయం సాధించింది. అంతకుముందు విజయ్‌శంకర్(29) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నార్జ్ రెండు, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ సీజన్‌లో వార్నర్ సేనకు ఇది వరుసగా రెండో ఓటమి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37; 32 బంతుల్లో 7 ఫోర్లు), సర్ఫరాజ్ ఖాన్ (30; 34 బంతుల్లో) రాణించగా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. ఆఖర్లో అక్షర్ పటేల్ (36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అర్ధసెంచరీతో గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
Chasing with conviction! ?⚡️#DCvGT | #AavaDe | #TATAIPL 2023pic.twitter.com/kFgqRVFcu0
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2023
A hard-earned victory in the Capital! ⚡??#DCvGT | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/VIB3px4xyz
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..