Team India: 45 సెంచరీల దండయాత్ర.. గురువును మించిన శిష్యుడు.. ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకంజలోనే..
Sachin Tendulkar vs Virat Kohli:వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే, మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 5 సెంచరీల దూరంలో..
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 45 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. సచిన్ 49 సెంచరీల రికార్డును ఎప్పుడు బద్దలు కొడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అతను 45 సెంచరీలతో దూసుకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ 45 సెంచరీల సమయంలో సచిన్, కోహ్లీ గణాంకాల మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
- విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో 257వ ఇన్నింగ్స్‌లో 45వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సందర్భంలో 424వ ఇన్నింగ్స్‌లో 45వ సెంచరీ సాధించిన సచిన్ కంటే చాలా వేగంగా దూసుకొచ్చాడు.
- అయితే, పరుగుల పరంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన శిష్యుడు కోహ్లి కంటే మైళ్ల దూరం ముందున్నాడు. ఈ సమయంలో సచిన్ 17168 పరుగులు చేయగా, కోహ్లీ తన ఖాతాలో 12584 పరుగులు మాత్రమే చేశాడు.
- ఇక హాఫ్ సెంచరీల గురించి మాట్లాడితే.. సచిన్ పేరుతో 96 హాఫ్ సెంచరీలు చేయగా, కోహ్లి 64 సార్లు హాఫ్ సెంచరీ సాధించాడు.
- ఇక యావరేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ కోహ్లీదే పైచేయిగా నిలిచింది. విరాట్ కోహ్లీ తన 45వ సెంచరీ వరకు 57.72 సగటుతో స్కోర్ చేయగా, సచిన్ 44.59 వద్ద పరుగులు చేశాడు. ఇది ఆ కాలంలో అద్భుతమైనదిగా పేరుగాంచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..