Sachin Tendulkar : నాటింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు కొట్టి అతని టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. బుమ్రా బ్యాటింగ్ చూసి భారత మాజీ బ్యాట్స్‌మన్, క్రికెట్ లెజండరీ సచిన్ టెండూల్కర్ అతడికి ఫ్యాన్ అయిపోయాడు. ట్విట్టర్ వేదికగా బుమ్రాని ప్రశంసించాడు. సచిన్ ట్వీట్ చేస్తూ “బౌలర్లు కొన్ని కీలక పరుగులు సాధించడం వల్ల టీమిండియాకు బలమైన ఆధిక్యం దక్కింది. తర్వాత ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి. జస్ప్రాత్ బుమ్రా తన జీవితంలో అత్యుత్తమ షాట్ ఆడాడు ” అని కొనియాడాడు.
అద్భుతమైన సిక్సర్
బుమ్రా ఈ మ్యాచ్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. కానీ శామ్ కుర్రాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన షాట్ గురించి టెండూల్కర్ మాట్లాడుతున్నాడు. భారత ఇన్నింగ్స్ 82 వ ఓవర్‌లో బుమ్రా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. మొదటి బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. తర్వాతి బంతి డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. తర్వాతి బంతికి మళ్లీ బౌండరీ బాదాడు. బుమ్రా సాధించిన అత్యధిక టెస్ట్ స్కోరు ఇదే. అయితే అతను బ్యాట్‌తో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదటిసారి మాత్రం కాదు. కానీ తన బ్యాటింగ్ సత్తా ఏంటో మాత్రం నిరూపించుకున్నాడు. మూడు ఫోర్లు ఒక సిక్సర్‌తో సాయంతో 28 పరుగులు చేయడంతో పాటు చివరి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లతో కలిసి 48 పరుగులు జోడించారు.
Formidable lead for #TeamIndia after some important runs added by the tail.
It’ll be interesting to see how England respond after being behind.
By the way, @Jaspritbumrah93 just played the shot of his life today. ?#ENGvIND
— Sachin Tendulkar (@sachin_rt) August 6, 2021