Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తన హయాంలో ఓ బౌలర్ తరువాత ఎలాంటి బంతిని వేయగలడో కూడా ఈ దిగ్గజ ఆటగాడు ఆలోచనచేసేవాడని ప్రతీతి. క్రికెట్‌పై అతని అవగాహనను ఎవరూ అనుమానించలేరు. అదే విధంగా, అతను యువ ఆటగాళ్లలోని ప్రతిభను కూడా గుర్తించి, వారిని ప్రోత్సహించడంలో ముందుంటాడు. సచిన్ నుంచి ప్రశంసలు అందుకోవడం ఏ యువ ఆటగాడికైనా పెద్ద విషయం. అతను భారత యువ ఆటగాళ్ల ప్రతిభ గురించి నిరంతరం మాట్లాడుతుంటాడు. జస్ప్రీత్ బుమ్రా నుంచి పృథ్వీ షా వరకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సచిన్ మరో భారత ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. భారత యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
సిరాజ్ త్వరగా నేర్చుకునే వ్యక్తిగా సచిన్ అభివర్ణించాడు. సిరాజ్ ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్‌ని సచిన్ మెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సిరాజ్ సాధించిన విజయాలకు ఈ రెండు లక్షణాలే కారణమని సచిన్ తెలిపాడు. సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లోనూ అతని బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు.
‘బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా’ కార్యక్రమంలో సిరాజ్ గురించి సచిన్ మాట్లాడుతూ, “అతని పాదాలలో ఏదో మాయ ఉంది. దానిని చూడటం నాకు చాలా ఇష్టం. అతని రన్ అప్… అతను చాలా ఎనర్జిటిక్ అని మీరు తన బౌలింగ్‌లో చూడవచ్చు. ఆ రన్‌అప్ చూస్తుంటే అది మొదటి ఓవర్ లేదా చివరి ఓవర్ అని తెలుసుకోలేం. అతను ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్స్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధంగా ఉంటాడు. అతను సరైన ఫాస్ట్ బౌలర్. అతని బాడీ లాంగ్వేజ్ చాలా సానుకూలంగా ఉంటుంది. నాకు ఈ విషయాలు చాలా ఇష్టం. అతను చాలా వేగంగా నేర్చుకుంటాడు” అని తెలిపాడు.
సిరాజ్ స్పందన..
సచిన్ చేసిన ప్రశంసలు సిరాజ్ చెవికి కూడా చేరాయి. దీనిపై సిరాజ్ తన స్పందనను తెలిపాడు. ఈ అభినందనకు ధన్యవాదాలు సచిన్ సర్ అంటూ సిరాజ్ ట్వీట్ చేశారు. మీ నుంచి ఇలాంటి అభినందనలు రావడం నాకు పెద్ద స్ఫూర్తి. నా దేశం కోసం నా వంతు కృషి చేస్తాను. ఆరోగ్యంగా ఉండండి సార్” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
సిరాజ్ కెరీర్..
ఐపీఎల్‌లో సిరాజ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అరంగేట్రం చేశాడు. ఇక్కడ నుంచి ముందుకు సాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ కూడా బాగానే ఆకట్టుకున్నాడు. అతని టీమ్ ఇండియా ప్రయాణం టీ20తో మొదలైంది. 4 నవంబర్ 2017న న్యూజిలాండ్‌తో రాజ్‌కోట్‌లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో అరంగేట్రం చేయడానికి అతనికి రెండేళ్లు పట్టింది. 15 జనవరి 2019న అడిలైడ్‌లో తన వన్డే అరంగేట్రం చేశాడు. అక్కడే మెల్‌బోర్న్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గతేడాది బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు సిరాజ్ భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు పడగొట్టాడు. నాలుగు టీ20 మ్యాచ్‌లలో అతని పేరు మీద నాలుగు వికెట్లు ఉండగా, వన్డేలలో అతని వికెట్ల ఖాతా ఇంకా తెరవలేదు.
Thank you @sachin_rt sir for this . It is a huge motivation for me coming from you .. I will always do my best for my country .stay well sir https://t.co/3qJrCBkwxm
— Mohammed Siraj (@mdsirajofficial) December 22, 2021
Also Read: Virat Kohli vs BCCI: మరోసారి మిస్సయిన విరాట్ కోహ్లీ.. ఎందుకిలా చేస్తున్నారంటోన్న ఫ్యాన్స్
BAN vs NZ: న్యూజిలాండ్ టెస్ట్ జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్.. వింత కారణం చెప్పిన కోచ్..!