SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్.. టాస్ గెల్చిన టీమిండియా.. దృష్టంతా కింగ్ కోహ్లీ పైనే..

|

Jun 29, 2024 | 8:22 PM

ICC T20 World Cup South Africa vs India Playing XI: 10 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆడేందుకు టీం ఇండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి.

SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్.. టాస్ గెల్చిన టీమిండియా.. దృష్టంతా కింగ్ కోహ్లీ పైనే..
India vs South Africa final
Follow us on

ICC T20 World Cup South Africa vs India Playing XI: 10 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆడేందుకు టీం ఇండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇరు జట్లు ప్రపంచకప్ కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. కాబట్టి హోరా హోరీ పోరును ఆశించవచ్చు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అలాగే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

టీ20 క్రికెట్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు మొత్తం 26 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది. టీమ్ ఇండియా 14 మ్యాచ్‌లు గెలిచింది. దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. అలాగే టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మొత్తం 6 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 4 సార్లు గెలుపొందగా, దక్షిణాఫ్రికా 2 సార్లు గెలిచింది.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

అజేయంగా ఫైనల్ కు..

ఇక T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా, టీం ఇండియా రెండూ అజేయంగా ఉన్నాయి. లీగ్ రౌండ్‌లోనూ, సూపర్ రౌండ్ లోనూ  మొత్తం 6 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సెమీస్ కు చేరుకుంది.  ఇక  లీగ్ రౌండ్‌లో 4, సూపర్ 8లో 3 సహా మొత్తం 7 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..