బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దక్షిణాఫ్రికా (Bangladesh vs South Africa) పై 3 మ్యాచ్‌ల వన్డే, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈమేరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్(Albie Morkel)ను బంగ్లాదేశ్ పవర్ హిట్టింగ్ కోచ్(Albie Morkel power-hitting coach)గా నియమించింది. అల్బీ మోర్కెల్ బంగ్లాదేశ్ జట్టుతో జతకట్టిన రెండవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. రెండు వారాల క్రితం బంగ్లాదేశ్ తమ బౌలింగ్ కోచ్‌గా అలన్ డొనాల్డ్‌ను నియమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనిస్ అల్బీ మోర్కెల్ జట్టులో చేరడాన్ని ధృవీకరించింది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, అల్బీ మోర్కెల్ బంగ్లాదేశ్ జట్టుతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆల్బీ మోర్కెల్‌కు ఎంతో అనుభవం ఉందని, అల్బీ మోర్కెల్ రాకతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్ లాభపడతారని భావిస్తున్నాం’ అని జలాల్ యూనిస్ పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్ పవర్ హిట్టింగ్‌లో సమస్యలకు చెక్ పడనుందా..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాటింగ్ కోచ్‌గా జామీ సిడాన్స్‌ను నియమించింది. బంగ్లాదేశ్ జట్టు పవర్ హిట్టింగ్ కోచ్‌ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. నిజానికి గత మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ జట్టు డెత్ ఓవర్లలో పవర్ హిట్టింగ్ చేయడంలో విఫలమైంది. అల్బీ మోర్కెల్‌ను బంగ్లాదేశ్ జట్టులోకి తీసుకోవడానికి ఇదే కారణం కావొచ్చని అంటున్నారు.
ఆల్బీ మోర్కెల్ ఫాస్ట్ హిట్టర్..
అల్బీ మోర్కెల్ T20 క్రికెట్‌లో అతిపెద్ద హిట్టర్లలో ఒకడిగా పేరుగాంచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో 248 సిక్సర్లు, 268 ఫోర్లు కొట్టాడు. మోర్కెల్ ఫోర్లు, సిక్సర్లు బాదిన రేటు దాదాపు సమానంగా ఉన్నట్లు గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతోంది.
ఐపీఎల్‌లో అల్బీ మోర్కెల్ సంచలనం..
IPL 2012లో అల్బీ మోర్కెల్ చెన్నై సూపర్ కింగ్స్‌కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వేసిన ఓవర్‌లో 28 పరుగులు చేసి చెన్నైకి విజయాన్ని అందించాడు. చెన్నై 207 పరుగుల లక్ష్యాన్ని చేధించగా, ఆ తర్వాత మోర్కెల్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. మోర్కెల్ IPLలో 55 సిక్సర్ల సహాయంతో 974 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 141 కంటే ఎక్కువగా ఉంది.