Video: టీమిండియా వద్దంది.. ఆర్‌సీబీ గెంటేసింది.. కట్‌చేస్తే.. 200 వికెట్లతో ఐపీఎల్‌లో స్పెషల్ రికార్డ్..

|

Apr 23, 2024 | 8:29 AM

Yuzvendra Chahal 200 IPL Wickets: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే, ఆర్పీ సింగ్ 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2010లో ఇలా చేశాడు. 2013లో ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడు లసిత్ మలింగ రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగాను నిలిచాడు.

Video: టీమిండియా వద్దంది.. ఆర్‌సీబీ గెంటేసింది.. కట్‌చేస్తే.. 200 వికెట్లతో ఐపీఎల్‌లో స్పెషల్ రికార్డ్..
Yuzvendra Chahal
Follow us on

Yuzvendra Chahal 200 IPL Wickets: ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ లెగ్ స్పిన్నర్, ముంబై ఇండియన్స్‌కు చెందిన మహ్మద్ నబీని ఔట్ చేయడం ద్వారా తన 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతని పేరిట 199 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అతను తన బౌలింగ్‌లో నబీ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ తనే పట్టుకున్నాడు. దీని తర్వాత మైదానంలో మోకాళ్లపై కూర్చుని, స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే, ఆర్పీ సింగ్ 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2010లో ఇలా చేశాడు. 2013లో ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడు లసిత్ మలింగ రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగాను నిలిచాడు. ఇప్పుడు చాహల్ 200 వికెట్లను చేరుకోవడంలో అద్భుతం చేశాడు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:

సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ మరియు యుజ్వేంద్ర చాహల్.

 ఇంపాక్ట్ ప్లేయర్లు :

జోస్ బట్లర్, కేశవ్ మహారాజ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వాద్రా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా మరియు జస్ప్రీత్ బుమ్రా.

 ఇంపాక్ట్ ప్లేయర్లు :

నువాన్ తుషార, ఆకాష్ మధ్వల్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..