Watch Video: టీ20 ప్రపంచకప్‌లో ఫెయిల్.. కట్ చేస్తే.. 271 స్ట్రైక్‌రేట్, 9 సిక్సర్లతో ఊచకోత..
ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. అక్కడ ప్రత్యర్ధులపై విధ్వంసం సృష్టిస్తున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఫెయిలైన చాలామంది బ్యాటర్లు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆదరగొడుతున్నారు. వారిలో ఒకరు వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మాన్ పావెల్. హిట్టింగ్‌కు ప్రసిద్ది చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. అక్కడ ప్రత్యర్ధులపై విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆదివారం బంగ్లా టైగర్స్ జరిగిన మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ కేవలం 28 బంతుల్లో 271 స్ట్రైక్‌రేట్‌తో 76 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 9 సిక్సర్లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌తో బంగ్లా టైగర్స్‌పై 6 వికెట్ల తేడాతో నార్తర్న్ వారియర్స్ విజయం సాధించింది.
ఈ టోర్నమెంట్‌లో నార్తర్న్ వారియర్స్‌కు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా బాధ్యతలు వహిస్తున్నాడు. లక్ష్యచేధనలో భాగంగా ప్రారంభంలోనే కెనార్ లూయిస్, ఆడమ్ లిత్ వికెట్లను కోల్పోయిన వారియర్స్ జట్టును.. మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 28 బంతుల్లో 76 పరుగులు చేసి.. చివరికి వరకు అజేయంగా నిలిచాడు. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు రోవ్‌మన్ పావెల్. కేవలం 3 మ్యాచ్‌ల్లో 39 పరుగులు మాత్రమే చేశాడు.
నార్తర్న్ వారియర్స్‌కు తొలి విజయం..
ఇప్పటిదాకా టీ10 లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన నార్తర్న్ వారియర్స్‌కు ఇదే మొట్టమొదటి విజయం. ఇంతకు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. అటు బంగ్లా టైగర్స్ జట్టు కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి.. ఒకదానిలో మాత్రమే విజయం సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచింది.