దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మంగళవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 25 బంతుల్లో 36, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్ (22 బంతుల్లో 44 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (9 బంతుల్లో 14) చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. అయితే 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ స్కోరు 194 పరుగులు మాత్రమే. చివరి ఓవర్‌లో స్టార్ బౌలర్ కగిసో రబాడా బంతి తీసుకున్నాడు. దీంతో పెద్దగా పరుగులు రావనుకున్నారు. అయితే స్ట్రైక్ తీసుకున్న రొమారియో షెపర్డ్ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. 2,6,4,6,6,2.. ఇలా పెను విధ్వంసం సృష్టించాడు. రబాడాకు చుక్కలు చూపిస్తూ ఒకే ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నాడు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఐడెన్ మార్ర్కమ్ (18 బంతుల్లో 35 నాటౌట్) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.
ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లతో సఫారీలను కట్టడి చేశాడు. ఈ విజయంతో వెస్టిండీస్ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సుమారు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టీ20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్ నిలవగా.. జాన్సన్ చార్లెస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.
West Indies vs South Africa 3rd T20 highlight
WI 220-8(20)/213-6(20)SA#Highlights #SAvsWI #3rdt20
Watch full highlight on YouTube ?https://t.co/tZW9e0Hbqc
1k subscribers Kara do yarr?
Share please #cricket pic.twitter.com/VJELBSzoVL— cricket kida (@cricket_kida1) March 29, 2023
First SERIES WIN as CAPTAIN! Thanks to all involved, until next time South Africa ??.#Rpowell52 pic.twitter.com/703d9d74Wy
— Rovman Powell (@Ravipowell26) March 29, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..