Romario Shepherd IPL 2022 Auction: పేస్‌, పవర్ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. అదిరిపోయే ఆఫరిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్..

Romario Shepherd Auction Price: రొమారియో షెపర్డ్‌పై మొదటి బిడ్‌తో లక్నో, ముంబై టీంలు పోటీ పడ్డాయి. ముంబై ఆధిక్యంలో ఉండటంతో బిడ్డింగ్ రూ. 2.4 కోట్లు దాటింది.

Romario Shepherd IPL 2022 Auction: పేస్‌, పవర్ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. అదిరిపోయే ఆఫరిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్..
Romario Shepherd

Updated on: Feb 13, 2022 | 5:35 PM

Romario Shepherd Auction Price: పేస్, పవర్ హిట్టింగ్ కలబోసిన విండీస్ ఆల్ రౌండర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాడ్ సొంతం చేసుకుంది. రొమారియో షెపర్డ్‌ కోసం చాలా జట్లు పోటీపడ్డాయి. అయితే బరిలో అన్ని జట్లను దాటుకుని ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంటుంది. మొదటి బిడ్‌తో లక్నో, ముంబై టీంలు పోటీ పడ్డాయి. ముంబై ఆధిక్యంలో ఉండటంతో బిడ్డింగ్ రూ. 2.4 కోట్లు దాటింది. ఆ తరువాత రూ. 3 కోట్లతో CSK ఎంట్రీ ఇచ్చింది. SRH రూ.4 కోట్లలో మరోసారి రేసులోకి వచ్చింది. CSK, SRH టీంలు రూ.5 కోట్లను అధిగమించాయి. SRH రూ. 5.25 కోట్లతో ముందంజలో ఉంది. ఆ తరువాత రాజస్థాన్ రూ.6 కోట్లతో రంగంలోకి దిగగా, SRH రూ. 6.25 కోట్లతో ముందంజలో నిలిచింది. రాజస్థాన్ ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు పెంచింది. SRH తిరిగి రూ. 7.25 కోట్లు, రాజస్థాన్ రూ. 7.5 కోట్లతో నిలిచాయి. RR వెనక్కు తగ్గడంతో SRH రూ. 7.75 కోట్లతో ఆధిక్యంలో నిలిచింది. షెపర్డ్ SRHకి రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది.

రొమారియో షెపర్డ్ ఒక గయానీస్ క్రికెటర్. అతను దేశీయ క్రికెట్‌లో గయానా తరపున ఆడుతున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ తరపున ఆడుతున్నాడు. షెపర్డ్ నవంబర్ 2019లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

కుడిచేతి ఫాస్ట్ బౌలర్ షెపర్డ్.. జనవరి 2016లో గయానా తరపున తన లిస్ట్ ఏలో అరంగేట్రం చేశాడు. 2015–16 రీజినల్ సూపర్50 లో లీవార్డ్ ఐలాండ్స్‌తో ఆడాడు. స్టీవెన్ జాకబ్స్‌తో కలిసి బౌలింగ్ ప్రారంభించి, అతను అరంగేట్రంలో 10 ఓవర్లలో 3/37 తీసుకున్నాడు. ఇందులో పడిన మొదటి రెండు వికెట్లతో సహా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. షెపర్డ్ 10 మార్చి 2017న 2016-17 గయానా తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. షెపర్డ్ 5 సెప్టెంబర్ 2018న టోర్నమెంట్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. డిసెంబర్ 2021లో 2022 పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం కరాచీ కింగ్స్‌తో తరపున సంతకం చేశాడు. టాటా IPL 2022 సీజన్ కోసం షెపర్డ్ హైదరాబాద్ సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.

Also Read: Jofra Archer IPL 2022 Auction: ఈ సీజన్‌లో ఆడడం లేదు.. అయినా రూ.8 కోట్లకు దక్కించుకున్న ముంబై.. ఎందుకంటే?

IPL 2022 Auction Unsold Players: ఈ దిగ్గజ ఆటగాళ్లను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు..