Rahul Chahar Coments : రోహిత్ శర్మ సిక్సర్ బాదేస్తాడు.. కానీ మ్యాచ్‌లో కాదు ఐపీల్ టైటిళ్లలో అంటున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ రాహుల్ చాహర్. తమ ఆటగాళ్లు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారని, సీనియర్లు, జూనియర్లు, కోచింగ్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉన్నారని వెల్లడించాడు. ఈ సందర్భంగా జట్టులోని సభ్యుల గురించి పలు విషయాలు వెల్లడించాడు.
‘రోహిత్ భయ్యా, హార్దిక్, పొలార్డ్ మా జట్టులో స్టార్ ఆటగాళ్లు. ఏ పరిస్థితుల్లోనైనా ఆటను మార్చే సత్తా వీరికి ఉందని కొనియాడాడు. ఈ ముగ్గురే కాకుండా సూర్య, ఇషాన్ మాకు అదనపు బలమన్నాడు. వారిప్పుడు అద్భుత ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ఏడాదిన్నర తర్వాత తాను టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశానని, కొన్ని విభాగాల్లో ఆటను మెరుగుపర్చుకుంటున్నానని చెప్పాడు. భారత్‌కు మూడు ఫార్మాట్లలో ఆడాలన్నది నా కోరికని, జహీర్ సర్ నా బౌలింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారన్నాడు.
జహీర్ ఖాన్, జయవర్దనె వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. ఇక ముంబై ఆరో టైటిల్ కొడుతుందన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. రాహుల్ 2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కేవలం 3 మ్యాచులే ఆడాడు. ఆ తర్వాత సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్‌లో కీలకంగా మారాడు. నిలకడగా రాణిస్తున్నాడు. పరుగులను నియంత్రిస్తూ వికెట్లు తీస్తున్నాడు. 2019, 2020లో ట్రోఫీలు గెలవడంలో రాహుల్ తన బౌలింగ్‌తో కీలకంగా మారాడు.
జట్టు సభ్యులు : రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), క్రిస్ లిన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ఆదిత్య తారే, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్, నాథన్ కౌల్టర్ నైలు, ఆడమ్ మిల్నే, పియూష్ చావ్లా, జేమ్స్ నీషామ్, యుధ్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్