Rohit vs Kohli: ఐపీఎల్ ఒకవైపు.. కోహ్లీ vs రోహిత్‌ల పోరు మరోవైపు.. నువ్వానేనా అంటోన్న దిగ్గజాలు.. ఎందుకో తెలుసా?

IPL 2024: బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఒకదానితో ఒకటి తలపడకుండా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోరు ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు మీకొస్తున్నాయా.. అసలు మ్యాటర్‌కి వచ్చేస్తున్నాం.. మొత్తం టోర్నీలో వీరి మధ్య కనిపించే పరుగుల రేసు కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఐపీఎల్‌లో ఓవరాల్ స్కోర్‌లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ చాలా ముందున్నాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య 1000 పరుగుల గ్యాప్ ఉంది. కాబట్టి, ఈ విషయంలో ఎలాంటి పోటీలేదు.

Rohit vs Kohli: ఐపీఎల్ ఒకవైపు.. కోహ్లీ vs రోహిత్‌ల పోరు మరోవైపు.. నువ్వానేనా అంటోన్న దిగ్గజాలు.. ఎందుకో తెలుసా?
Rohit Sharma Virat Kohli

Edited By:

Updated on: Mar 19, 2024 | 2:54 PM

Rohit Sharma vs Virat Kohli: పార్టీ అప్పుడే మొదలైంది. మ్యాచ్ జరిగే రోజుకు ముందే సందడి మొదలైంది. రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ పోటీ ఎలా ఉంటుందో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగడం గురించే కాదు.. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ vs విరాట్ కోహ్లీ మధ్య మ్యాచ్ కొనసాగుతుందన్నమాట. అందుకే ఐపీఎల్ 2024 పోరు ఒకవైపు, రోహిత్-విరాట్ మధ్య కనిపించే వివాదం మరోవైపు అని చెబుతున్నాం.

బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఒకదానితో ఒకటి తలపడకుండా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోరు ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు మీకొస్తున్నాయా.. అసలు మ్యాటర్‌కి వచ్చేస్తున్నాం.. మొత్తం టోర్నీలో వీరి మధ్య కనిపించే పరుగుల రేసు కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఐపీఎల్‌లో ఓవరాల్ స్కోర్‌లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ చాలా ముందున్నాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య 1000 పరుగుల గ్యాప్ ఉంది. కాబట్టి, ఈ విషయంలో ఎలాంటి పోటీలేదు. అయితే ఐపీఎల్‌లో ఓపెనర్‌గా సాధించిన పరుగుల పరంగా వీరి మధ్య పోటీ ఉండవచ్చు.

ఐపీఎల్ 2024లో రోహిత్, విరాట్ మధ్య పోరు హోరాహోరీ!

ఐపీఎల్ 2024లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పోరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే. చరిత్ర అంటే ఇప్పటి వరకు ఓపెనింగ్‌లో ఉన్న వీరి మధ్య ఉన్న గణాంకాలు చూద్దాం..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2018 నుంచి ఇప్పటి వరకు ఉన్న గ్రాఫ్‌ను పరిశీలిస్తే, రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కోసం ఓపెనింగ్ చేస్తున్నప్పుడు, 71 ఇన్నింగ్స్‌లలో 1744 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 127.1, సగటు 24.91లుగా నిలిచింది. ఇది కాకుండా, రోహిత్ 75 సిక్సర్లు కొట్టి 8 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.

ఐపీఎల్ 2018 నుంచి బెంగళూరు కోసం ఓపెనింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ 55 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను 1861 పరుగులు చేశాడు. విరాట్ స్ట్రైక్ రేట్ 131.9గా ఉంది. కాగా సగటు 37.22 మాత్రమే. ఈ సమయంలో విరాట్ 50 సిక్సర్లు కొట్టాడు. అయితే అతని బ్యాట్ నుంచి 14 అర్ధ సెంచరీలు, 3 సెంచరీలు వచ్చాయి.

విరాట్‌కు పోటీగా రోహిత్ సన్నాహాలు..

ఐపీఎల్‌లో ఓపెనింగ్‌ రేసు విరాట్‌ కోహ్లి పేరు మీదనే ఉందనేది స్పష్టం. పరుగులు, భారీ స్కోర్ల పరంగానే కాకుండా స్ట్రైక్ రేట్, యావరేజ్ పరంగానూ విరాట్ కాస్త ముందున్నాడు. ఐపీఎల్ 2024లో రోహిత్‌కి కెప్టెన్సీ బాధ్యత ఉండదు. అందువల్ల, ఓపెనర్‌గా ఆడుతున్నప్పుడు, అతను తన స్ట్రైక్ రేట్, సగటు, పరుగుల గణాంకాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు. దీని కోసం, అతను ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ప్రాక్టీస్‌లో తనకు ఇష్టమైన షాట్లను ఆడుతూ కనిపించాడు.

విరాట్ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మరికొందరు క్రికెట్ పండితులు చెప్పినట్లుగా, విరాట్ విరామం నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా భారీ స్కోర్లు నమోదు చేస్తుంటాడు. ఇటువంటి పరిస్థితిలో IPL 2024లో కనిపించబోయే రోహిత్, విరాట్ మధ్య ఈ యుద్ధంలో ప్రేక్షకులకు చాలా వినోదం, థ్రిల్ ఉండబోతోందన్నమాట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us