Rohit Sharma: రంజీ ట్రోఫీలో ఆడడం, గంభీర్‌తో విభేదాలపై నోరు విప్పిన రోహిత్.. ఏమన్నాడంటే?

Rohit Sharma Comments on Gambhir: విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టుపై మాట్లాడుతూనే, మరోవైపు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగే అంశంపై, గంభీర్‌తో విభేదాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

Rohit Sharma: రంజీ ట్రోఫీలో ఆడడం, గంభీర్‌తో విభేదాలపై నోరు విప్పిన రోహిత్.. ఏమన్నాడంటే?
Rohith Sharma

Updated on: Jan 18, 2025 | 6:07 PM

Rohit Sharma in Ranji Trophy: దేశవాళీ క్రికెట్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఆడటంపై వాడివేడిగా చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుని ముంబైకి రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన సమయంలోనే ఈ వివరాలు ప్రకటించేశాడు. నిరంతర బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్నేళ్లుగా ఆడటం కష్టమైందని, అయితే ఈసారి మైదానంలోకి దిగుతానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అంటే దాదాపు 9-10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రోహిత్ రంజీ ట్రోఫీ టోర్నీలో ఆడనున్నాడు.

ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీమ్ ఇండియా ప్రకటన తర్వాత, ఎంపికకు సంబంధించిన అంశాలపై మాత్రమే కాకుండా, కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను దేశవాళీ క్రికెట్ ఆడే సీనియర్ ఆటగాళ్ల గురించి కూడా ప్రశ్నలు సంధించారు. ఈ సమయంలో ఇద్దరూ ఖచ్చితంగా ఏ ఆటగాడు అందుబాటులో ఉంటే.. ఆ ఆటగాడు ఆడతాడని తెలిపారు. ముంబైతో జరిగే తదుపరి మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు రోహిత్ ఇక్కడే చెప్పేశాడు. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో ముంబై జట్టు రంగంలోకి దిగనుంది. రోహిత్ అంతకుముందు 2015లో తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు.

దేశవాళీ క్రికెట్‌పై రోహిత్ ఏమన్నాడంటే?

ఈ సమయంలో, టీమ్ ఇండియా కెప్టెన్ మాట్లాడుతూ, గత 7-8 సంవత్సరాలలో, టీమ్ ఇండియా క్యాలెండర్ చాలా బిజీగా ఉందని, అంతర్జాతీయ సిరీస్, ఐపీఎల్ వంటి టోర్నమెంట్ల తర్వాత ఆటగాళ్లకు కూడా కొన్ని రోజుల విరామం అవసరం. అప్పుడే తాజాగా ఉండగలరు. నేను టెస్టు జట్టులో ఆడుతున్న 7 సంవత్సరాల నుంచి నాకు అవకాశం లభించలేదు. ఇన్ని సంవత్సరాలలో, క్రికెట్ జరుగుతున్నప్పుడు కూడా మేం ఇంట్లో వరుసగా 45 రోజులు కూడా గడపలేకపోయాం. అన్ని ఫార్మాట్లలో ఆడని ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ, రాహుల్ ఆడరు..

ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడతాడా లేదా అని తన తోటి సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి చూపు చూస్తున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫిట్‌నెస్‌ కారణంగా జనవరి 23 నుంచి జరగనున్న మ్యాచ్‌లో ఆడేందుకు విరాట్ నిరాకరించినట్లు సమాచారం. మెడనొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోతున్నానని కోహ్లీ వెల్లడించినట్లు సమాచారం. అతనితో పాటు, కేఎల్ రాహుల్ కూడా మోచేయి గాయం కారణంగా కర్ణాటక తదుపరి మ్యాచ్‌లో ఆడేందుకు నిరాకరించాడు. అయితే, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తమ తమ జట్లతో ఆడనున్నారు.

గంభీర్‌తో విభేదాలపైనా..

ఇక గంభీర్‌తో విభేదాలపైనా రోహిత్ శర్మ స్పందించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, నాకు, గంభీర్‌కు మధ్య విభేదాలు వచ్చినట్లు బయట మాట్లాడుతున్నారు. మైదానంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అందుకు ఓకే చెప్పే వ్యక్తి గంభీర్. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..