హిట్‌మ్యాన్‌తోనే మైండ్ గేమ్సా? నాడు తప్పు చేసి, ఇప్పుడు తల పట్టుకున్న బీసీసీఐ.. దిమ్మతిరిగే ట్విస్ట్..!

Team India ODI Captain: టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వైస్ కెస్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నారు. దీంతో భారత వన్డే జట్టు కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

హిట్‌మ్యాన్‌తోనే మైండ్ గేమ్సా? నాడు తప్పు చేసి, ఇప్పుడు తల పట్టుకున్న బీసీసీఐ.. దిమ్మతిరిగే ట్విస్ట్..!
Rohit Sharma

Updated on: Nov 20, 2025 | 7:29 AM

Rohit Sharma ODI Captain: త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టు కెప్టెన్సీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లైన శుభ్‌మాన్ గిల్ (ప్రస్తుత కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్) ఇద్దరూ అందుబాటులో ఉండకపోవడమే దీనికి కారణం.

గిల్, అయ్యర్ దూరం..

శుభ్‌మాన్ గిల్ 3 ఫార్మాట్లలో నిరంతరం క్రికెట్ ఆడుతుండటంతో అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో అతను కూడా సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

రోహిత్ పేరు తెరపైకి..

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ లేకపోవడంతో సోషల్ మీడియాలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిపుణుల వాదన..

రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం తక్కువని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత (విరాట్ కోహ్లీ తరహాలో), కేవలం ఆటగాడిగా, సలహాదారుడిగా ఉండటానికే ఇష్టపడతారని అంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ స్వేచ్ఛగా ఆడి పరుగులు సాధించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

కేఎల్ రాహుల్‌కు ఛాన్స్?..

రోహిత్ కాకపోతే, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

హార్దిక్ పాండ్యా పరిస్థితి..

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. అతను వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నా, టీ20 సిరీస్‌కు అందుబాటులోకి రావొచ్చు.

జట్టు కూర్పు అంచనా..

కెప్టెన్సీ కోసం రోహిత్ పేరు వినిపిస్తున్నా, అతను బాధ్యతలు తీసుకోవడం అనుమానంగా ఉంది. అయితే, ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తోంది. గిల్ లేకపోవడంతో యశస్వి జైస్వాల్ రోహిత్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు అని తెలుస్తోంది. వన్-డౌన్‌లో కోహ్లీ, శ్రేయస్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..