Rohit Sharma: ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకున్నప్పటి నుంచి, ఒక ప్రశ్న నిరంతరం చర్చిల్లోకి వస్తోంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ఆ ప్రశ్న. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా పలువురు క్రికెట్ నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు ముంబై ఇండియన్స్ గ్లోబల్ క్రికెట్ హెడ్ మహేల జయవర్ధనే సమాధానమిచ్చాడు. రోహిత్ పాత్రను వివరించడానికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పాత్రను తీసుకున్నారు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు కీలక పాత్ర పోషించినట్లు, రోహిత్ శర్మ కూడా అదే పాత్ర పోషిస్తాడని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఈ వెటరన్ శ్రీలంక క్రికెటర్ మాట్లాడుతూ, ‘రోహిత్ మైదానంలో, వెలుపల జట్టులో ఉండటం ముంబై ఇండియన్స్ తరువాతి తరానికి మార్గనిర్దేశం చేయడంలో మాకు సహాయపడుతుంది. అతను చాలా తెలివైన క్రికెటర్. రోహిత్‌తో చాలా సన్నిహితంగా పనిచేశాను. అతను కూడా అసాధారణ మానవుడు. మార్గదర్శక వెలుగుగా పనిచేసే ముంబై ఇండియన్స్ వారసత్వంలో అతను భాగమవుతాడని నాకు నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
మహేల జయవర్ధనే మాట్లాడుతూ, ‘ఇంతకుముందు ముంబై ఇండియన్స్‌తో కూడా ఇలాగే జరిగింది. సచిన్ టెండూల్కర్ యువ క్రికెటర్లతో ఆడుతున్నాడు. అతను కెప్టెన్సీని మరొకరికి అప్పగించాడు. ముంబై ఇండియన్స్ సరైన దిశలో వెళుతున్నట్లు నిర్ధారించాడు. రోహిత్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మేం ఈ విషయంపై చర్చించాం. ఈ నిర్ణయంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు.
అభిమానుల ఆగ్రహాంపై జయవర్ధనే స్పందించారు. ఈ సమయంలో, జయవర్ధనే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా క్రికెట్ అభిమానుల స్పందన గురించి కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, ‘అభిమానులు ఇలా స్పందించడం సమంజసమే. ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారని, దానిని మనం కూడా గౌరవించాలని నేను భావిస్తున్నాను. అయితే, అదే సమయంలో ఫ్రాంచైజీగా మీరు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సచిన్ సమయంలోనూ ఇలాగే జరిగింది’ అంటూ సమాధానమిచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..