Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ సంచలన నిర్ణయం! షాక్‌ లో ఫ్యాన్స్‌.. బీసీసీఐ అలా చేయడంతో..

టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే పొట్టి ఫార్మాట్ కు గుడ్ చై చెప్పేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. టెస్టు, వన్డే జట్లకు నాయకత్వం వహించే సామర్థ్యం తనలో ఇంకా ఉందంటూ అప్పట్లో వెల్లడించాడు హిట్ మ్యాన్. అయితే గత కొన్ని రోజులుగా కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు రోహిత్ శర్మ.

Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ సంచలన నిర్ణయం! షాక్‌ లో ఫ్యాన్స్‌.. బీసీసీఐ అలా చేయడంతో..
Rohit Sharma

Updated on: Feb 05, 2025 | 1:57 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఆటతీరుపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ను నడిపించే బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికలను బీసీసీఐకి చెప్పాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ ఇప్పుడు తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. రోహిత్ 2025 ఏప్రిల్ నాటికి 38 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రిటైర్మెంట్ గురించి తరచుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కాస్త కఠినంగా వ్యవహరించి రోహిత్ నుంచి సరైన సమాధానం కోరింది. ఒక నివేదిక ప్రకారం, టీం ఇండియా సెలెక్టర్లు 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక వేయాలనుకుంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ వైఖరి కూడా స్పష్టంగా ఉండాలి. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నమెంట్ తర్వాత, టీం ఇండియాలో మార్పు దశ రావచ్చని భావిస్తున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తు కూడా ఛాంపియన్స్ ట్రోఫీపై నే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో అతను అద్భుతంగా రాణించాలి. టోర్నమెంట్ ముగిసిన తర్వాత, రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికను BCCIకి సమర్పించాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడా లేదా ఆటను కొనసాగిస్తాడా? అన్నది పూర్తి క్లారిటీ రానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికలేంటో రోహిత్ నిర్ణయించుకోవాలని బీసీసీఐ సూచించింది. ఎందుకంటే రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC), 2027 ODI ప్రపంచ కప్ కోసం జట్టు యాజమాన్యం కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ నిర్ణయం కూడా కీలకం కానుంది.

ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. దీనికి ముందు, ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ వన్డే సిరీస్‌లో కూడా టీం ఇండియాకు రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా తనపై వస్తోన్న విమర్శలకు రోహిత్ జవాబు చెప్పాలని అతని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..