India vs England: ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ ఫాం చాలా కీలకం: టీమిండియా మాజీ క్రికెటర్ రితేందర్

| Edited By: Venkata Chari

Jul 11, 2021 | 5:19 PM

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్లు 5 టెస్టుల సిరీస్‌లో తలపడనున్నారు.

India vs England: ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ ఫాం చాలా కీలకం: టీమిండియా మాజీ క్రికెటర్ రితేందర్
Rohit Sharma
Follow us on

India vs England: రోహిత్ శర్మ.. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలకమైన ప్లేయర్. ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డులను క్రియోట్ చేశాడు. దాంతో టెస్టుల్లోనూ ఓపెనింగ్ బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఫార్మెట్‌లో తొలుత ఇబ్బంది పడినా.. ప్రస్తుతం మంచి ఫాంతో ఆకట్టుకుంటున్నాడు. టెస్టు జట్టులోనూ ముఖ్యమైన ప్లేయర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. ఆగస్టులో టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఫాం చాలా కీలకమని భారత మాజీ ఆల్‌ రౌండర్ రితేందర్ సోధి వెల్లడించాడు.

‘రోహిత్ ఫాంలో ఉన్నప్పుడు అతనిని ఆపడం బౌలర్లు చెమటోడ్చాల్సిందేనని, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ ఒకడని, ఇంగ్లండ్‌లో రోహిత్‌ రికార్డు చాలా మెరుగ్గా ఉందని’ ఆయన పేర్కొన్నాడు. ‘టీమిండియాలో రోహిత్‌తోపాటు చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు భారత టీంకు చాలా ముఖ్యమని, ఇంగ్లండ్ సిరీస్‌లొ వీరు ముగ్గురి ఫాం చాలా కీలకమని, టీమిండియా విజయావకాశాలు వీరిపైనే ఆధారపడి ఉంటాయని’ సోధి అన్నారు.

టెస్టు క్రికెట్‌లో అడుగులు..
‘రోహిత శర్మ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాడని, ప్రస్తుతం మంచి ఆటను ప్రదర్శశిస్తున్నాడు. అద్భుత ఫాంలో ఉంటే.. ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడని’ ఆయన కొనియాడారు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 39 టెస్టులు ఆడాడు. 46.19 సగటుతో 2679 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ యావరేజ్ 57.9 గా ఉంది.

Also Read:

Tokyo Olympics 2021: అథ్లెట్లను ఉత్సాహపరిచిన టీమిండియా క్రికెట్లరు.. వీడియో పంచుకున్న బీసీసీఐ! జులై 17 న టోక్యో బయలుదేరనున్న అథ్లెట్లు

8 ఓవర్లలో 10 వికెట్లు డౌన్.. అంతా కలిపి సాధించిన స్కోర్ చూస్తే షాకవ్వాల్సిందే..!

Wimbledon 2021, Men’s Final: 20వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నొవాక్‌ జకోవిచ్‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన బెరెట్టిని!