Rohit Sharma Holi Video: స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా, అతను ఎప్పుడూ సరదాగా గడిపే అవకాశాన్ని వదిలిపెట్టడు. గత చాలా సంవత్సరాలుగా అభిమానులు అతని ఈ రూపాన్ని చూస్తూనే ఉన్నారు. IPL 2024 సీజన్‌లో కూడా, అతను తన ఈ శైలిని చూపించడంలో విఫలం కాలేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల రోహిత్ అసంతృప్తిగా కనిపించి ఉండవచ్చు. కానీ, ముంబై ఇండియన్స్ హోలీ వేడుకలలో అతను తన జోవియల్ ఫామ్‌ను చూపించాడు. తడిసి ముద్దైన రోహిత్, ఇతర సహచరులపై కూడా నీళ్ల వర్షం కురిపించాడు.
మార్చి 25 సోమవారం నాడు దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దేశప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెటర్లు కూడా ఇందులో తక్కువేం కాదని నిరూపించారు. రంగులతో హోలీని బాగా ఎంజాయ్ చేశారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వీడియోతో సందడి చేశాడు. అందులో అతను నీళ్లతోపాటు రంగులతో తడిసి ముద్దయ్యాడు. అలాగే, రోహిత్ డ్యాన్స్ చూస్తూ, ఆయన భార్యకు కూడా రంగులు పూస్తూ కనిపించాడు. అలాగే, వీడియో తీస్తున్న ముంబై ఇండియన్స్ మీడియా టీమ్ సభ్యునిపై కూడా నీళ్ల వర్షం కురిపించాడు. ఇది చూసి అందరూ నవ్వ్వకున్నారు.
Happy Holi, everyone! 😍🎨
Brb, admin needs to get the phone repaired 🥲#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/4I0aIqnvru
— Mumbai Indians (@mipaltan) March 25, 2024
రోహిత్, ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు.. ఇతర జట్లు కూడా హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరకు ప్రతి ఫ్రాంచైజీ హోలీని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, గత కొన్నేళ్లుగా హోలీ సమయంలో ఐపీఎల్ సీజన్ జరిగినప్పుడల్లా, భారతీయ ఆటగాళ్లతో పాటు, విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఈసారి కూడా అదే కనిపించింది. స్టార్ స్పోర్ట్స్‌కు వ్యాఖ్యానిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా రంగులు పులుముకున్నారు.
Bura na maano, Holi hai! 😂💜 pic.twitter.com/B02FGO6hsE
— KolkataKnightRiders (@KKRiders) March 25, 2024
రోహిత్ శర్మ ఈ IPL సీజన్‌కు ముందు, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి లాక్కున్నారు. దీని కారణంగా రోహిత్ సంతోషంగా కనిపించలేదు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఇది చర్చల్లోకి వచ్చింది. కెప్టెన్సీని కోల్పోయిన సందర్భంలో బౌలర్లపై రోహిత్ తన కోపాన్ని బయటపెడతాడా అని రోహిత్ అభిమానులు ప్రత్యేకంగా చూడాలనుకున్నారు. తన అభిమానుల అంచనాలను రోహిత్ నిజం చేశాడని చెప్పడం తప్పు కాదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 29 బంతుల్లో 43 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అయినప్పటికీ అతని జట్టు 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..