Rohit Sharma: ఆయన కెప్టెన్ పీస్ కానే కాదు.. ఆ ఒక్కటే లోపం: రోహిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్..

|

Jan 07, 2023 | 8:57 PM

Kapil Dev: రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై భారత దిగ్గజం కపిల్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ క్రికెట్ స్కిల్స్‌కు ఎలాంటి వంక పెట్టలేమని, కానీ, అతని ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రశ్నగా మారిందంటూ..

Rohit Sharma: ఆయన కెప్టెన్ పీస్ కానే కాదు.. ఆ ఒక్కటే లోపం: రోహిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్..
3. రోహిత్ శర్మ - అత్యధిక వన్డే వ్యక్తిగత స్కోరు - 264: ఇక ఈ లిస్టులో రోహిత్‌కు సంబంధించిన ఓ రికార్డు కూడా చేరింది. అత్యధిక వన్డే వ్యక్తిగత స్కోర్ సాధించిన రోహిత్.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
Follow us on

గాయం కారణంగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనలేదు. వచ్చే వారం నుంచి జరిగే వన్డే సిరీస్‌లో పునరాగమనం చేసేందుక సిద్ధమయ్యాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI సిరీస్‌లో అతను బొటనవేలికి గాయమైంది. ఆ కారణంగా రోహిత్ బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డే, టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం ఇదే మొదటిసారి కానప్పటికీ, అతను జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి, 25 కంటే ఎక్కువ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు సంధించారు.

రోహిత్ శర్మ క్రికెట్ నైపుణ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గత దశాబ్దంలో విరాట్ కోహ్లీతో పాటు భారత బ్యాటింగ్‌కు మూలస్తంభాలలో ఒకడిగా నిలిచాుడ. కానీ, అతని ఫిట్‌నెస్ ఆందోళన కలిగించే అంశంగా మరారింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని కపిల్ చెప్పుకొచ్చారు.

గత ఏడాది భారత మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అప్పటి నుంచి భారత్ మొత్తం 68 మ్యాచ్‌లు (5 టెస్టులు, 21 వన్డేలు, 42 టీ20లు) ఆడింది. మరోవైపు రోహిత్ 39 మ్యాచ్‌లు (2 టెస్టులు, 8 వన్డేలు, 29 టీ20లు) మాత్రమే ఆడగలిగాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పనిభారాన్ని నిర్వహించడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. అయితే గాయం కారణంగా రోహిత్ చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

కపిల్ దేవ్ ఓ మీడియాతో మాట్లాడుతూ, “రోహిత్ శర్మలో ఎలాంటి లోపం లేదు. అతనిలో అన్నీ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా అతని ఫిట్‌నెస్‌పై పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందని నేను భావిస్తున్నాను. అతను తగినంత ఫిట్‌గా ఉన్నాడా? ఎందుకంటే కెప్టెన్ ఇతర ఆటగాళ్లను ఫిట్‌గా ఉండేలా ప్రేరేపించేలా ఉండాలి. జట్టు సభ్యులు తమ కెప్టెన్‌ని చూసి గర్వపడాలి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..