Video: 2027 ప్రపంచకప్ నా చేతులతో ఎత్తుడు ఫిక్స్.. పంత్‌కు చెప్పేసిన రోహిత్

2023 ప్రపంచ కప్‌ను కెప్టెన్‌గా గెలిపించే అవకాశాన్ని రోహిత్ తృటిలో కోల్పోయాడు. ఎందుకంటే, అప్పటి వరకు టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే, వచ్చే ప్రపంచకప్‌లో మాత్రం ట్రోఫీ ఎత్తాలని రోహిత్ శర్మ ఫిక్స్ అయ్యాడు.

Video: 2027 ప్రపంచకప్ నా చేతులతో ఎత్తుడు ఫిక్స్.. పంత్‌కు చెప్పేసిన రోహిత్
Rohit Rishabh Pant

Updated on: Dec 05, 2025 | 1:28 PM

2027 World Cup: రాయ్‌పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే సరదా సంభాషణలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య జరిగిన ఒక హృదయపూర్వక సంఘటన నెట్టింట సందడి చేస్తోంది.

రోహిత్ కంటి రెప్ప ఊడితే..

మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ పక్కన నిల్చున్న రిషబ్ పంత్, రోహిత్ కంటి రెప్ప ఒకటి ఊడి ముఖంపై పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆ రెప్పను తీసి, రోహిత్ చేతిపై పెట్టి “ఏదైనా కోరిక కోరుకో భయ్యా” అని చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది. చిన్న పిల్లల్లా వీరిద్దరూ చేసిన ఈ పని కెమెరాలకు చిక్కడంతో అభిమానులు ముచ్చటపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ కోరిక అదేనా?

ఈ వీడియోపై స్పందించిన భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, రోహిత్ మనసులో ఏముందో వెల్లడించారు. “రోహిత్‌కు ప్రధానంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి, 2027 వన్డే ప్రపంచ కప్‌ను తన చేతులతో ఎత్తడం. మరొకటి, రాబోయే మ్యాచ్‌లో సెంచరీ చేయడం” అని అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పేర్కొన్నారు.

వరల్డ్ కప్ లక్ష్యంగా..

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత, 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచి రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని ప్రధాన లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమేనని ఈ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ గెలవాలన్న కోరిక నెరవేరాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.