IND vs NZ: 3 మ్యాచ్‌లు.. 3 పరాజయాలు.. ధోని, కోహ్లీకి సాధ్యం కానిది.. రోహిత్ చేసేనా.. ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించేనా?

ధర్మశాలలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడినప్పుడు అసలు మజా కనిపిస్తుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విలన్‌గా మొత్తం న్యూజిలాండ్ జట్టు ఉంటుంది. ఇంతకుముందు ముగ్గురు కెప్టెన్లు చేయని పనిని రోహిత్ శర్మ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే, గత నాలుగు ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ టీంను టీమిండియా ఓడించలేకపోయింది. ఒకవేళ గెలవాలంటే ప్రపంచకప్ చరిత్రలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటనే పునరావృతం కావాల్సి ఉంటుంది.

IND vs NZ: 3 మ్యాచ్‌లు.. 3 పరాజయాలు.. ధోని, కోహ్లీకి సాధ్యం కానిది.. రోహిత్ చేసేనా.. ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించేనా?
India Vs New Zealand

Updated on: Oct 21, 2023 | 9:00 PM

ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆడి విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో దేశ రాజధాని ఢిల్లీలో రోహిత్ శర్మ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న టీమ్ ఇండియా, అక్కడ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడి ప్రపంచకప్‌ చరిత్రలో 8వ విజయంతో సందడి చేసింది. అహ్మదాబాద్ నుంచి పూణే చేరుకుంది. అక్కడ భారతో మరొక పొరుగు దేశం అంటే బంగ్లాదేశ్ జట్టను ఓడించింది. ఇలా 4 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించిన తర్వాత, టీమ్ ఇండియా బలం పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వాస్తవానికి ఇది ఒక సంగ్రహావలోకనం మాత్రమే. ఎందుకంటే అసలు చిత్రం ఇంకా రాలేదు.

ధర్మశాలలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడినప్పుడు అసలు మజా కనిపిస్తుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విలన్‌గా మొత్తం న్యూజిలాండ్ జట్టు ఉంటుంది. ఇంతకుముందు ముగ్గురు కెప్టెన్లు చేయని పనిని రోహిత్ శర్మ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే, గత నాలుగు ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ టీంను టీమిండియా ఓడించలేకపోయింది. ఒకవేళ గెలవాలంటే ప్రపంచకప్ చరిత్రలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటనే పునరావృతం కావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2003లో జరిగిన ధర్మశాలలో రోహిత్ అదే చేయనున్నాడా..

రోహిత్ శర్మ తన ప్రణాళికలలో విజయం సాధించకుండా నిరోధించడానికి, న్యూజిలాండ్ జట్టు ధర్మశాలలో విలన్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉంటుంది. అయితే, కివీస్ జట్టును ఓడించేందుకు రోహిత్ తన అస్ట్రశస్త్రాలను రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే 2003 ప్రపంచకప్‌లో జరిగినదే రిపీట్ అవుతుంది.

ఇప్పుడు 2003లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చివరిసారిగా న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత, భారత జట్టు ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో 4 ODI ప్రపంచ కప్‌లు ఆడింది. కానీ, న్యూజిలాండ్‌ను మాత్రం ఓడించలేకపోయింది.

ముగ్గురు కెప్టెన్లు విఫలం.. ఇప్పుడు రోహిత్ ఏం చేస్తాడో..

రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత్ 2007 ప్రపంచకప్ ఆడింది. తొలిదశలోనే ఎలిమినేట్ కావడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ జరగలేదు. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ 2011 ప్రపంచకప్ ఆడింది. టీమ్ ఇండియా ఇక్కడ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 2015 ప్రపంచకప్‌లో కూడా ఎంఎస్ ధోని జట్టు న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. విరాట్ కెప్టెన్సీలో ఆడిన 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ని ఎవరు మర్చిపోగలరు. ఇక్కడ కూడా భారత్ ఓడిపోయింది.

ఇప్పుడు 2023 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టు దూసుకుపోతున్న విజయ రథాన్ని చూస్తుంటే చరిత్ర మారిపోతుందనిపిస్తోంది. ద్రవిడ్, ధోనీ, విరాట్‌లు కెప్టెన్సీలో చేయలేకపోయిన దాన్ని రోహిత్ శర్మ చేస్తాడా లేదా అనేది చూడాలి. 2003 ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీలో చివరిసారిగా న్యూజిలాండ్‌ను ఎలా ఓడించాడో అదే విధంగా ధర్మశాలలో న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది.

టీమ్ ఇండియాదే గెలుపు..

అయితే ఇదంత తేలికైన పనికాదు. చాల కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే, టీమ్ ఇండియాలాగే న్యూజిలాండ్ కూడా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో ఉంది. దీంతో రేపటి పోరు ఎలా ఉంటుందోనని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని కీలక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us