Video: మరోసారి అదేసీన్.. అంపైర్‌తో రోహిత్ వాగ్వాదం.. తెలుగబ్బాయ్ ఎంట్రీతో..!

Rohit Sharma Bat thickness check: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో రోహిత్ శర్మ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాట్ కొలతల తనిఖీ సమయంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే, ఇన్నింగ్స్ ఆరంభానికి ముందే అంపైర్లు రోహిత్ బ్యాట్ పరిమాణాన్ని పరీక్షించగా, అది వివాదానికి దారితీసింది.

Video: మరోసారి అదేసీన్.. అంపైర్‌తో రోహిత్ వాగ్వాదం.. తెలుగబ్బాయ్ ఎంట్రీతో..!
Rohit Sharma Bat Thickness Check Video

Updated on: Apr 13, 2026 | 9:36 PM

Rohit Sharma Bat thickness check: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గ్లౌజుల మార్పుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, ఇప్పుడు రోహిత్ శర్మ బ్యాట్ తనిఖీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ముంబై ఇన్నింగ్స్ ప్రారంభం కావడానికి ముందు, ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ల బ్యాట్లను అంపైర్లు సాధారణ ‘గేజ్ పరీక్ష’కు గురిచేశారు. ఈ క్రమంలో రోహిత్ బ్యాట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అనుమానాన్ని అంపైర్లు వ్యక్తం చేయడంతో రోహిత్ ఒక్కసారిగా అసహనానికి లోనయ్యాడు.

రోహిత్ వాదన, తిలక్ వర్మ మద్దతు..

తన బ్యాట్‌లో ఎటువంటి లోపం లేదని, అది నిబంధనలకు లోబడే ఉందని రోహిత్ అంపైర్‌కు వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. అంపైర్లు తనిఖీ కోసం ఉపయోగిస్తున్న పరికరంలో లోపం ఉందని, దానిని సరిగ్గా ఉపయోగించడం లేదని తిలక్ అంపైర్లతో వాదించాడు. రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపించిన కోపం, తిలక్ వర్మ జోక్యం చేసుకున్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమై వైరల్ అయ్యాయి. చివరకు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అంపైర్లు ఆ బ్యాట్‌తో ఆడేందుకు అనుమతిని ఇచ్చారు.

బ్యాట్ తనిఖీ నియమాలు ఏమిటి?

క్రికెట్ నిబంధనల ప్రకారం, బ్యాట్,క్క వెడల్పు, మందం నిర్దేశిత పరిమితిలో ఉండాలి. బ్యాట్లు మైదానంలో అదనపు ప్రయోజనాన్ని చేకూర్చకుండా ఉండటానికి అంపైర్లు తరచుగా ఈ ‘గేజ్ టెస్ట్’ నిర్వహిస్తుంటారు. బ్యాట్ అంచులు 40 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనల అమలులో భాగంగానే రోహిత్ బ్యాట్‌ను కూడా పరీక్షించారు.

గాయంతో వెనుదిరిగిన హిట్ మ్యాన్..

ఈ గొడవ ముగిసిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, కేవలం 13 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే దురదృష్టవశాత్తూ, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పరిస్థితి విషమించకుండా ఉండటానికి ఆయన ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రోహిత్ గాయం ఎంత తీవ్రంగా ఉందనే విషయంపై ముంబై యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పరిణామం ముంబై అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us