IND vs SL: తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు? లంకతో తలపడే రోహిత్ సేన ఎలా ఉందంటే?

|

Aug 02, 2024 | 7:37 AM

Sri Lanka vs India, 1st ODI: జూన్ 29న టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, అతను ODI ఫార్మాట్‌లో ఆడటం కొనసాగిస్తాడు. కెప్టెన్సీ బాధ్యత కూడా అతని భుజాలపై ఉంది. వరల్డ్‌కప్‌ గెలిచి తొలి సిరీస్‌ ఆడబోతున్న కెప్టెన్‌ రోహిత్‌కి కీలక నిర్ణయాలు తీసుకోవడం సవాల్‌‌గా మారింది. శ్రీలంకతో నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

IND vs SL: తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు? లంకతో తలపడే రోహిత్ సేన ఎలా ఉందంటే?
Ind Vs Sl 1st Odi
Follow us on

Sri Lanka vs India, 1st ODI: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీమిండియాకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. జూన్ 29న టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, అతను ODI ఫార్మాట్‌లో ఆడటం కొనసాగిస్తాడు. కెప్టెన్సీ బాధ్యత కూడా అతని భుజాలపై ఉంది. వరల్డ్‌కప్‌ గెలిచి తొలి సిరీస్‌ ఆడబోతున్న కెప్టెన్‌ రోహిత్‌కి కీలక నిర్ణయాలు తీసుకోవడం సవాల్‌‌గా మారింది. శ్రీలంకతో నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తొలి మ్యాచ్‌ ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బాధ్యతలు ఎవరికి ఇవ్వనున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

ఆగస్టు 2 నుంచి టీమిండియా-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్‌తో పాటు, విరాట్ కోహ్లీ కూడా టీమ్ ఇండియాకు తిరిగి రాగా, టీ20 జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాట్స్‌మెన్స్ కూడా తిరిగి వచ్చారు. అలాగే, శుభమాన్ గిల్ ఇప్పటికే ఓపెనర్‌గా జట్టులో భాగమయ్యాడు. ఈ ఐదుగురు ప్రపంచ కప్ 2023లో భారత బ్యాటింగ్ లైనప్‌లో భాగమైన, బలమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు. అయితే, ఇప్పుడు రిషబ్ పంత్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి, వికెట్ కీపర్ పాత్రలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

పంత్‌కి రోహిత్‌ అవకాశం ఇస్తాడా?

భారత కెప్టెన్ రోహిత్ ఎప్పుడూ రిషబ్ పంత్‌కు మద్దతు ఇస్తూ అతనికి అవకాశాలను ఇస్తుంటాడు. రోహిత్ కెప్టెన్సీలో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రిషబ్ అద్భుతమైన సెంచరీని సాధించడం ద్వారా టీమిండియాను విజయపథంలో నడిపించాడు. డిసెంబర్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా అవుట్ కావడానికి ముందు, రిషబ్ పంత్ తన చివరి 5 ODI ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, అర్ధ సెంచరీ సాధించాడు. ఇటీవలే టీ20 ప్రపంచ కప్ నుంచి తిరిగి వచ్చిన పంత్, కొన్ని చిన్నదైన ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా తన బలాన్ని చూపించాడు. ఇక, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, బ్యాటింగ్ ప్రాక్టీస్ కోణంలో ఈ సిరీస్‌లో పంత్‌కు అవకాశం ఇవ్వడం లాజికల్‌గా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

రాహుల్‌కు మాత్రమే అవకాశం?

ఇదిలావుండగా, తొలి వన్డేలో పంత్‌కు అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈ పాత్ర కేఎల్ రాహుల్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ కొనసాగింపును ప్రోత్సహించడమే దీనికి కారణం. రాహుల్ ODI ప్రపంచ కప్‌లో వికెట్ కీపర్‌గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ సమయంలో అతను మిడిల్ ఆర్డర్‌లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఫైనల్‌ను పక్కన పెడితే, అతను విభిన్న పరిస్థితులలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపింగ్‌లో కూడా అద్భుతాలు చేశాడు. రాహుల్ ప్రపంచ కప్‌లో 10 ఇన్నింగ్స్‌లలో 75 సగటుతో 452 పరుగులు చేశాడు. 17 అవుట్‌లను కూడా చేశాడు. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా ప్రపంచకప్‌లో మాదిరిగానే బ్యాటింగ్ ఆర్డర్‌తో ఫీల్డింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే పంత్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..