ఒక్కసారి తప్పు చేస్తే పర్వాలేదు.. కానీ అదే తప్పు పునరావృతం అయితే.. కచ్చితంగా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా ఈ టీమ్‌కు అదే జరిగింది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది పార్ల్ రాయల్స్. అంతర్జాతీయ టీ20ల్లో 48 బంతుల్లో సెంచరీ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ రాయల్స్ జట్టుకు ఓటమి రుచి చూపించాడు. మరి అతడెవరో కాదు రిలే రూసో.
రిలే రస్సో తన జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను దక్షిణాఫ్రికా టీ20 లీగ్ టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కు చేర్చాడు. మొదటి సెమీఫైనల్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసింది. తద్వారా ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో పార్ల్ రాయల్స్ 24 గంటల్లో రెండోసారి ఓటమిని చవిచూసింది.
మొదటి సెమీఫైనల్‌లో, ప్రిటోరియా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫలితంగా లక్ష్యచేదనలో పార్ల్ రాయల్స్ 19 ఓవర్లకు 124 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు. రిలే రూసో. అతడు కేవలం 41 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. కాగా, గతేడాది అక్టోబర్‌లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో రూసో దక్షిణాఫ్రికా తరఫున 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో మెరుపు టీ20 సెంచరీ సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో రూసోకి ఇది తొలి శతకం.