
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగగా, న్యూజిలాండ్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సొంత గడ్డపై భారత్ సిరీస్ కోల్పోవడంతో మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్, ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా గంభీర్ ఆధ్వర్యంలోనే కోల్పోయింది. నిన్న మొదలైన టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ గెలిచిన సంగాతి తెలిసిందే.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ భారత జట్టు ఓటమిపై స్పందించారు. సొంత గడ్డపై భారత్ ఓడిపోవడం దారుణమని, ఇది చెత్త ప్రదర్శన కారణంగానే జరిగిందని విమర్శించారు. ఐపీఎల్ ఆధారంగా గౌతమ్ గంభీర్‌కు హెడ్ కోచ్ పదవి ఇవ్వడంపై బీసీసీఐని తప్పుబట్టారు పాంటింగ్. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత జట్టును తక్కువ అంచనా వేయలేమని చెప్పిన పాంటింగ్, ఈ వన్డే సిరీస్‌లో టీం మేనేజ్‌మెంట్, టీం సెలక్షన్ వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయని అన్నారు.
ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..