Rest of India vs MP: గత రంజీ ఛాంపియన్ ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ ఈసారి కూడా ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. ఇరానీ కప్‌లో ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ జట్టు రంజీ ట్రోఫీ 2022 ఛాంపియన్ మధ్యప్రదేశ్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. గతసారి కూడా ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ ఈ కప్‌ను గెలుచుకుంది. అప్పుడు సౌరాష్ట్రను ఓడించింది.
ఇరానీ కప్ 2023లో, ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ (154), యశస్వి జైస్వాల్ (213) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులు చేసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన యష్ దూబే (109) సెంచరీ చేయడంతో ఫాలోఆన్‌ను తప్పించుకుంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. ఈ విధంగా తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’కు 190 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (144) సెంచరీ చేసి జట్టును 246 పరుగులకు చేర్చాడు. దీంతో మధ్యప్రదేశ్‌కు 437 పరుగుల విజయ లక్ష్యం లభించింది. ఇక్కడ మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో, హిమాన్షు మంత్రి (51), హర్ష్ గావ్లీ (48) కొంతసేపు పోరాడారు. అయితే మ్యాచ్ చివరి రోజు మొత్తం మధ్యప్రదేశ్ జట్టు 198 పరుగులకు ఆలౌటైంది. ఈ విధంగా ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ జట్టు 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి ఇరానీ కప్‌ను గెలుచుకుంది.
213, 144 పరుగులతో యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ తరపున పుల్కిత్ నారంగ్ 6 వికెట్లు, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ తలో 4 వికెట్లు తీశారు. మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి అవేశ్‌ఖాన్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..