Reliance Mega Merger: రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా విలీనం పూర్తి..ఒకే గొడుగు కిందకు జియోస్టార్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్

భారతదేశ టెలివిజన్, డిజిటల్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియోస్టార్ ఇండియా, తమ వ్యాపార నిర్మాణాన్ని విస్తృత పరిచే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. చారిత్రక STAR ట్రేడ్‌మార్క్‌ను కలిగి ఉన్న స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్‎ను అధికారికంగా జియోస్టార్ ఇండియా లో విలీనం చేసే ప్రక్రియ పూర్తయింది.

Reliance Mega Merger: రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా విలీనం పూర్తి..ఒకే గొడుగు కిందకు జియోస్టార్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్
Reliance Mega Merger

Updated on: Dec 02, 2025 | 7:02 PM

Reliance Mega Merger: భారతదేశ టెలివిజన్, డిజిటల్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియోస్టార్ ఇండియా, తమ వ్యాపార నిర్మాణాన్ని విస్తృత పరిచే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. చారిత్రక STAR ట్రేడ్‌మార్క్‌ను కలిగి ఉన్న స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్‎ను అధికారికంగా జియోస్టార్ ఇండియా లో విలీనం చేసే ప్రక్రియ పూర్తయింది. ఈ విలీనం ద్వారా STAR బ్రాండ్‌పై పూర్తి యాజమాన్యం, నియంత్రణ ఇప్పుడు ఒకే సంస్థ కిందకు రానుంది. ఇది సంస్థ టెలివిజన్, డిజిటల్ కార్యకలాపాలను ఏకీకృతం చేయడంలో కీలకం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విలీన ప్రక్రియ నవంబర్ 30, 2025న అధికారికంగా పూర్తయినట్లు జియోస్టార్ ఇండియా ప్రకటించింది. నవంబర్ 30, 2025 నుంచి విలీనం అమలులోకి వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ధృవీకరించింది. ఈ చర్య నవంబర్ 2024 లోనే ప్రకటించారు. స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ చారిత్రకంగా STAR ట్రేడ్‌మార్క్‌ను కలిగి ఉండి, దానిని రిలయన్స్ కంట్రోల్లో ఉన్న అనేక నెట్‌వర్క్ వ్యాపారాలకు లైసెన్స్ ఇచ్చేది.

ఇప్పుడు స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్‎ను జియోస్టార్ ఇండియా (గతంలో స్టార్ ఇండియా)లో విలీనం చేయడం ద్వారా, ప్రసార, స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియో చట్టపరమైన నిర్మాణం పూర్తయింది. ఇకపై టెలివిజన్ ఛానెల్స్‌తో పాటు జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా STAR లేబుల్‌పై కంట్రోల్ ఒకే చోట ఉంటుంది. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి, జియోస్టార్ ఇండియా ఇప్పటికే రంగంలో ఒక దిగ్గజ సంస్థగా నిలిచింది. సెప్టెంబర్ 2025 క్వార్టర్‌కు గాను జియోస్టార్ ఇండియా రూ. 7,232 కోట్ల ఆదాయం, పన్ను తర్వాత రూ.1,322 కోట్ల లాభాన్ని నివేదించింది.

ఈ సంవత్సర ప్రారంభంలో జియోస్టార్ ప్లాట్‌ఫారమ్ జియోసినిమాను డిస్నీ+ హాట్‌స్టార్‎తో విలీనం చేసి జియోహాట్‌స్టార్ ను ప్రారంభించింది. ఈ విలీనం జియోస్టార్‌కు డిజిటల్ రంగంలో తిరుగులేని బలాన్ని ఇచ్చింది. ఈ వ్యాపారం భవిష్యత్తు వ్యాపార వ్యూహాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కీలకమైన విలీనం అయినప్పటికీ మార్కెట్ నుంచిస్పందన చాలా తక్కువగా ఉంది. విలీన ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 1 శాతం స్వల్పంగా తగ్గాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..