
Team India England Tour: భారత క్రికెట్ రంగానికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు అత్యంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. సీనియర్ల గైర్హాజరు, బాధ్యతారాహిత్యం, పదే పదే చేస్తున్న ప్రయోగాల కారణంగా టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే కూడా జట్టు యాజమాన్యం తీరు, ఆటగాళ్ల ఎంపిక విధానం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఈ వరుస వైఫల్యాల వెనుక ఉన్న అసలు కారణాలేంటో విశ్లేషిద్దాం.
గతంలో ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అద్భుతంగా రాణించిన చరిత్ర కలిగిన భారత జట్టు, ఈసారి మాత్రం దారుణంగా తడబడింది. గౌతమ్ గంభీర్ కోచింగ్ పర్యవేక్షణలో బరిలోకి దిగిన టీమిండియా, పర్యటనలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ దారుణ ప్రదర్శన చేసింది.
ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 1-2తో ఇంగ్లాండ్‌కు అప్పగించింది. పరుగుల వేటలో బ్యాటర్లు విఫలమవ్వడమే కాకుండా, బౌలింగ్ విభాగంలోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లే పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
ఈ వరుస ఓటములకు ప్రధాన కారణం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకుంటున్న నిర్ణయాలేనని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రో-కో) వంటి దిగ్గజ ఆటగాళ్లను జట్టు నుంచి ఎలా సాగనంపాలనే అంశంపై పెట్టిన శ్రద్ధను, జట్టు విజయం సాధించడంపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.
ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత టెస్టులు, వన్డేలు, టీ20లలో వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ముఖ్యంగా కోచ్ గంభీర్‌కు నచ్చిన వారు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అత్యంత సన్నిహితులు, శ్రేయస్ అయ్యర్, సెలెక్టర్ అగార్కర్‌లకు నచ్చిన ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
విదేశీ గడ్డపై ఆడి అనుభవం ఉన్న మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి దిగ్గజ బౌలర్లను పక్కనపెట్టి, అనుభవం లేని యువ ఆటగాళ్లను ఎంపిక చేయడం తీవ్ర ప్రతికూలంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా మినహా ఇంగ్లీష్ కండిషన్స్ లో వికెట్లు తీయగల బౌలర్ ఒక్కడు కూడా కనిపించలేదు.
మరొకవైపు బ్యాటింగ్ విభాగంలో ఆటగాళ్లకు నిర్దిష్టమైన స్థానం లేకుండా పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వారి ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో ఏ ఒక్క ఆటగాడు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి