IPL 2025: కామన్‌సెన్స్ లేదు..! కోహ్లీ అండ్ కో టీమ్‌ను పొట్టుపొట్టు తిట్టిన సెహ్వాగ్! ఎందుకంటే..?
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. వర్షం కారణంగా మ్యాచ్ 14 ఓవర్లకు కుదించారు. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లు దారుణంగా విఫలమయ్యారు. టీమ్ డేవిడ్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. టిమ్ డేవిడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతను కూడా విఫలం అయి ఉంటే.. ఆర్సీబీ లోయెస్ట్ టోటల్ 49 పరుగుల చెత్త రికార్డును కూడా బ్రేక్ చేసి ఉండేది. అయితే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు కాస్త కామన్‌సెన్స్ ఉయోగించి ఉంటే బాగుండేదంటూ చురకలు అంటించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
అది కూడా టిమ్ డేవిడ్ రెస్క్యూ ఇన్సింగ్స్ కారణంగా ఆ స్కోర్ వచ్చింది. 96 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. చిన్న టార్గెట్‌ను కాపాడుకునేందుకు ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ కావాల్సినన్ని పరుగులు లేకపోవడం వారి ప్రభావాన్ని తగ్గించింది. మంచి బ్యాటింగ్ ట్రాక్‌లో ఆర్సీబీ ఒక దశలో 8.2 ఓవర్లలో 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులు చేయకపోయి ఉంటే ఆర్సీబీ మరింత దీన స్థితిలో ఉండేది. ఈ క్రమంలో మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఆర్సీబీ బ్యాటర్లు నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ అవుటయ్యారని సెహ్వాగ్ విమర్శించాడు. “ఆర్సీబీ పేలవంగా బ్యాటింగ్ చేసింది. వారందరూ నిర్లక్ష్యంగా షాట్లు ఆడారు. ఒక్క బ్యాటర్ కూడా మంచి బంతికి అవుట్ కాలేదు. కనీసం ఒక్క బ్యాటర్ అయినా కామన్‌సెన్స్‌ను ఉపయోగించి ఉండాల్సింది.
వారి చేతిలో వికెట్లు ఉంటే, వారు 14 ఓవర్లలో 110 లేదా 120 పరుగులు చేయగలిగేవారు, అది వారికి పోరాడటానికి అవకాశం ఇచ్చేది” అని సెహ్వాగ్ అన్నాడు. తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్‌ను అర్ష్‌దీప్ సింగ్ 4 పరుగులు చేసి ఔట్ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీతో జతకట్టాడు. రెండో ఓవర్లోనే రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయి దాటాడు. కాగా, మూడవ ఓవర్‌లో విరాట్ కోహ్లీని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. కోహ్లీ కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్లో జేవియర్ బార్ట్‌లెట్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేయడంతో ఆర్సీబీ 4 ఓవర్ల పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పో్యింది. అయినా కూడా ఆర్సీబీ బ్యాటర్లు కాస్త ఆలోచించి ఆడలేదు. అదే ఓవర్ అగ్రెసివ్ షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. బాల్ కాస్త ఆగి వస్తున్నా, సరిగ్గా బ్యాట్ పైకి రాకపోయినా.. బలవంతంగా షాట్లు ఆడే ప్రయత్నం చేసి ఫీల్డర్ల చేతికి చిక్కారు.
జితేష్ శర్మ, పటిదార్ కూడా అలాంటి షాట్లే ఆడి అవుట్ అయ్యారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనోజ్ భండగే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ వికెట్లతో ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయింది. కానీ, చివర్లో టిమ్ డేవిడ్ స్ట్రైక్ తన వద్దే ఉంచుకుంటూ.. ఆఖరి ఓవర్‌లో ఓ మూడు సిక్సులు కొట్టడంతో ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. అదే ఓవర్‌లో ఓ నో బాల్, రెండు రన్స్‌తో కలిపి చివరి ఓవర్‌లో 21 రన్స్ ఇచ్చాయి. అవి ఆర్సీబీలో కాస్త ఆశలు పెంచినా.. పంజాబ్ జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును 100 పరుగుల లోపు పరిమితం చేసినందుకు పంజాబ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలని సెహ్వాగ్ అన్నాడు. కానీ ఆర్సీబీతో మ్యాచ్‌లో వాళ్లే వికెట్లు సమర్పించుకున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
“వికెట్లు తీయడం, వికెట్లు సంపాదించడం మధ్య వ్యత్యాసం ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాట్స్‌మెన్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడంపై సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి వరుసగా మూడో హోం గ్రౌండ్ ఓటమి, సొంత గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన జట్టుగా కూడా నిలిచారు. చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఈ విషయంలో కెప్టెన్ పాటిదార్ ఆలోచించి ఒక పరిష్కారం కనుగొనాలని సెహ్వాగ సూచించాడు. వారి బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. కానీ, వారి బ్యాటర్లు ఎందుకు తడబడుతున్నారు? మీ బ్యాటర్లు సొంత గ్రౌండ్‌లో బాగా ఆడేలా సరిదిద్దాలని సెహ్వాగ్ అన్నాడు. మరి చూడాలి.. సెహ్వాగ్ కామెంట్స్‌తోనైనా ఆర్సీబీలో మార్పు వస్తుందో లేదో?
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




