RCB vs KKR, IPL 2023 Highlights: బెంగళూరుకు షాక్.. కోల్‌కతా ఖాతాలో మూడో విజయం..

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders IPL 2023 Highlights in Telugu: రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్‌ విజయాలే లక్ష్యంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.

RCB vs KKR, IPL 2023 Highlights: బెంగళూరుకు షాక్.. కోల్‌కతా ఖాతాలో మూడో విజయం..
RCB vs KKR, IPL 2023 Live Score

Edited By: Venkata Chari

Updated on: Apr 26, 2023 | 11:21 PM

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders IPL 2023 Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయం తర్వాత నితీష్ రాణా సారథ్యంలోని కోల్‌కతా ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాలనే ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, బెంగళూరు 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.

ఎం.చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్‌ విజయాలే లక్ష్యంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా గతంలో కోల్‌కతా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. అయితే వరుసగా 4 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టాలంటే బాగా శ్రమించాల్సిందే.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Apr 2023 11:17 PM (IST)

    సత్తా చాటిన కోల్‌కతా.. 21 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ఈ విజయం తర్వాత నితీష్ రాణా సారథ్యంలోని కోల్‌కతా ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాలనే ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, బెంగళూరు 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.

    ఎం.చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 26 Apr 2023 11:00 PM (IST)

    8 వికెట్లు డౌన్..

    17.3 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కార్తీక్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరు విజయం సాధించాలంటే 14 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది.


  • 26 Apr 2023 10:50 PM (IST)

    16 ఓవర్లకు 145 పరుగులు..

    16 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కార్తీక్ 15, హసరంగా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. బెంగళూరు విజయం సాధించాలంటే 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.

  • 26 Apr 2023 10:50 PM (IST)

    13 ఓవర్లకు 121 పరుగులు..

    13 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి, రస్సెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 26 Apr 2023 10:12 PM (IST)

    9 ఓవర్లకు 80 పరుగులు..

    9 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

  • 26 Apr 2023 09:52 PM (IST)

    కోహ్లీ బౌండరీల వర్షం.. 4 ఓవర్లలోనే 50 దాటిన ఆర్సీబీ స్కోరు..

    201 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. ముఖ్యంగా స్టాండింగ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు విరాట్‌. అతని ఇన్నింగ్స్‌ లో 5 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్‌ (17), షాబాజ్‌ అహ్మద్‌ (2) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 52/2.

  • 26 Apr 2023 09:18 PM (IST)

    జూలు విదిల్చిన కోల్‌కతా బ్యాటర్లు..

    కోల్‌కతా జూలు విదిల్చింది. వరుసగా 4 పరాజయాలు ఎదురుకావడంతో నిరాశకు లోనైన ఆ జట్టు ఆటగాళ్లు బుధవారం మాత్రం బెంగళూరుపై విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ (56), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (48) బెంగళూరు బౌలర్లను చితక బాదారు.

  • 26 Apr 2023 08:56 PM (IST)

    కెప్టెన్ రాణా దూకుడు.. 150 పరుగులు దాటిన స్కోరు..

    కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా దూకుడుగా ఆడుతున్నాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతున్నాడు. 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 42 పరుగులు చేశాడు రాణా. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి 167/2

  • 26 Apr 2023 08:10 PM (IST)

    దంచికొడుతున్న కోల్‌కతా.. రాయ్‌ అర్ధ సెంచరీ..

    బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ కేవలం 24 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. 8 ఓవర్లు ముగిసే సరికి కోల్‌ కతా స్కోరు 75/0

  • 26 Apr 2023 07:15 PM (IST)

    ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..

    RCB :

    విరాట్ కోహ్లి (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

    KKR:

    నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, నారాయణ్ జగదీషన్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వీసా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా

  • 26 Apr 2023 07:13 PM (IST)

    కోల్‌కతా తరపున వైభవ్ అరంగేట్రం

    కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రైట్ ఆర్మ్ మీడియం పేసర్ వైభవ్ అరోరా అరంగేట్రం చేశాడు. వైభవ్ గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీశాడు.

     

  • 26 Apr 2023 07:04 PM (IST)

    టాస్‌ గెలిచిన బెంగళూరు..

    ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండింగ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి కోల్‌కతాను బ్యాటింగ్‌ కు ఆహ్వానించాడు. ప్లేయింగ్-XI, ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్టులపై మరికొన్ని క్షణాల్లో క్లారిటీ రానుంది.

  • 26 Apr 2023 06:58 PM (IST)

    ప్రతీకారం కోసం బెంగళూరు ఆరాటం..

    కాగా ఈ సీజన్‌లో బెంగళూరు, కోల్‌కతా తలపడడం ఇది రెండోసారి. చివరి మ్యాచ్‌లో కోల్‌కతా తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏకపక్షంగా 81 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ఇప్పుడు స్వదేశంలో కోల్ కతా లెక్క సరిచేయాలని ఆర్సీబీ భావిస్తోంది.