AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Vs KKR: ఆ 3 తప్పులు సరిచేస్తే ఆర్సీబీదే విజయం.. ఓడితే మాత్రం 2 భారీ నష్టాలు ఖాయం.!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన వైరం ఉన్న జట్లలో బెంగళూరు, కోల్‌కతా ఒకటి. బుధవారం జరగనున్న 57వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న బెంగళూరుకు ఈ విజయం ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేస్తుంది.

RCB Vs KKR: ఆ 3 తప్పులు సరిచేస్తే ఆర్సీబీదే విజయం.. ఓడితే మాత్రం 2 భారీ నష్టాలు ఖాయం.!
Rcb Ipl 2026
Ravi Kiran
|

Updated on: May 13, 2026 | 11:09 AM

Share

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలా మారుతోంది. ముఖ్యంగా బుధవారం జరగనున్న 57వ లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడి ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరగనుంది. ఒకరికి అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనే తపన, మరొకరికి టోర్నీలో నిలవాలనే ఆరాటం. ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ‘హై వోల్టేజ్’గానే ఉంటుంది.

ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మంచి పొజిషన్‌లో ఉంది. అయితే, ప్లేఆఫ్స్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలంటే ఈ మ్యాచ్ విజయం వారికి చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ టాప్-2లో ఉండటం దాదాపు ఖాయమవుతుంది. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఓడిపోతే మాత్రం, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో(పంజాబ్, హైదరాబాద్‌తో) ఖచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం అభిమానులను కలవరపెడుతోంది. పవర్ ప్లేలో జోష్ హేజిల్‌వుడ్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి ‘చావో రేవో’ అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్, ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుండి దాదాపుగా తప్పుకున్నట్లే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వారి ఆశలు సజీవంగా ఉంటాయి. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లే కేకేఆర్‌కు ప్రధాన బలం. ఆర్సీబీ బ్యాటర్లను వీరు ఎలా అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కేకేఆర్ బ్యాటర్లు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా రాణించాల్సి ఉంది.

ఆర్సీబీ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. అయితే, మిడిల్ ఆర్డర్‌లో జితేష్ శర్మ, బెథెల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు బలహీనతగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్ళీ నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని బెంగళూరు కృతనిశ్చయంతో ఉంది. అటు కేకేఆర్ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డనుంది. మొత్తానికి ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇది పాయింట్ల పట్టికలో పెను మార్పులకు నాంది కానుంది. మరి ఈ ఉత్కంఠ పోరులో విజేతగా నిలిచి ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేసే జట్టేదో చూడాలి!

Follow Us
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్