ఈరోజు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అష్టకష్టాలు పడింది. క్రీజులో నిలవడమే బ్యాటర్లకు కష్టమైంది. 18.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ ఎదుట 129 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. 14 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ టీం.. 32 పరుగుల వద్ద రెండు, 44 వద్ద మూడు, 46 వద్ద 4, 67 వద్ద 5, 67 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. 83 పరుగుల వద్ద ఏడు, 99 వద్ద ఎనిమిది, 101 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పో్యింది. ఇక చివరి వికెట్‌ను 128 పరుగుల వద్ద కోల్పోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో వసిందు హసరంగా 4 వికెట్లు, ఆకాష్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ ఒక్కడే 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా 20 లోపే పెవిలియన్ చేరారు. రహానే 9, వెంకటేష్ అయ్యర్ 10, శ్రేయాస్ అయ్యర్ 13, రాణా 10, సునీల్ నరైన్ 12, బిల్లింగ్స్ 14, జాక్సన్ 0, సౌథీ 1, ఉమేష్ యాదవ్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
పవర్ ప్లేలో KKR బ్యాటర్ల ముందు ఫాఫ్ ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించాడు. ప్రత్యేక ఫీల్డింగ్ సెట్ చేయడంతో వెంకటేష్, రహానే, రానా, అయ్యర్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. అయ్యర్ కోసం, అతను డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డర్‌ను ఉంచాడు. ఆకాశ్ దీప్ వేసిన మూడో ఓవర్లో 14 బంతుల్లో 10 పరుగుల వద్ద వెంకటేష్ ఔటయ్యాడు. 10 బంతుల్లో 9 పరుగులు చేసిన తర్వాతి ఓవర్‌లోనే రహానే వికెట్ కూడా కోల్పోయాడు. అజింక్యా వికెట్‌ను మహ్మద్ సిరాజ్ తీయగా, డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌లో షాబాజ్ అహ్మద్ క్యాచ్ పట్టాడు.
ప్లేయింగ్ XI:
RCB: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హస్రంగ, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
KKR : అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.