RCB: ప్లే ఆఫ్స్‌ కోసం పెద్ద ప్లానే వేసిన ఆర్సీబీ! ఏకంగా ఆ జింబాబ్వే ప్లేయర్‌ను దించేసింది..!

ప్లేఆఫ్స్‌లో సత్తా చాటేందుకు ఆర్సీబీ జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానిని తమ జట్టులో చేర్చుకుంది. లుంగీ ఎన్గిడి స్థానంలో ముజారబాని చేరిన విషయం గమనార్హం. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌కు విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించడంతో కొంతమంది ఆటగాళ్ళు తిరిగి రాలేదు.

RCB: ప్లే ఆఫ్స్‌ కోసం పెద్ద ప్లానే వేసిన ఆర్సీబీ! ఏకంగా ఆ జింబాబ్వే ప్లేయర్‌ను దించేసింది..!
Blessing Muzarabani

Updated on: May 19, 2025 | 3:24 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించడంతో ఆ జట్టుతో పాటు ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. జీటీ 18, ఆర్సీబీ 17, పంజాబ్‌ 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లాయి. ఇక ప్లే ఆఫ్స్‌లో ఎలాగైనా సత్తాచాటి తొలి కప్పును ముద్దాడాలని ఆర్సీబీకి తమ టీమ్‌లోకి ఓ మంచి బౌలర్‌ను తీసుకొచ్చింది. అది కూడా జింబాబ్వే దేశం నుంచి ఓ ప్లేయర్‌ను ఏరికోరి తెచ్చింది. ఆ ప్లేయర్‌ పేరు బ్లెస్సింగ్ ముజారబాని.

6 అడుగుల 8 అంగుళాల పొడుగు ఉండే టాల్‌ హల్క్‌.. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. గతంలో టీమిండియాతో జింబాబ్వే టీ20 సిరీస్‌ ఆడిన సమయంలో మంచి ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇటీవలె భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌కు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. తిరిగి 17 నుంచి రీ స్టార్ట్ అయింది. రీ స్టార్ట్‌ అయిన ఐపీఎల్‌కు కొంతమంది ప్లేయర్లు తిరిగి రాలేదు. ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో ఆడిన లుంగీ ఎన్గిడి కూడా మళ్లీ రాలేదు. అతని స్థానంలో ఆర్సీబీ ముజారబానిని రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి